E-Paper
Advertisement

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో
Advertisement

Malayalam Mystery Thriller: కొన్ని సినిమాలు చూస్తుంటే… ఏది నిజం? ఏది భ్రమ? అనే సందేహం చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. కథలోని ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందనిపించినా… చివరికి మరో కోణం కనిపిస్తుంది. అలాంటి అరుదైన సినిమాల్లో Churuli కూడా ఒకటి. మలయాళ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ హారర్ సినిమా ఇప్పటికే విడుదలై, కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. సాధారణ హారర్ సినిమాలకు పూర్తి భిన్నంగా, ప్రేక్షకుడిని ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమాను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు మయిలాడన్ జాయ్ కోసం ఇద్దరు అండర్‌కవర్ పోలీసులు అడవిలోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తారు. సాధారణ వ్యక్తుల్లా వేషం మార్చుకుని జీపులో ప్రయాణం మొదలు పెడతారు. ప్రయాణం మొత్తం ప్రశాంతంగానే సాగుతుంది. కానీ ఒక పాత చెక్క వంతెన దాటిన క్షణం నుంచి వాళ్ళ జీవితమే మారిపోతుంది.

Advertisement

ఆ వంతెన దాటి చురులి అనే గ్రామంలో అడుగు పెట్టగానే అక్కడి మనుషుల ప్రవర్తన పూర్తిగా విచిత్రంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వరకు సాధారణంగా కనిపించిన వాళ్లే ఒక్కసారిగా విచిత్రంగా, క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. పగటిపూట ఒకలా, రాత్రిపూట మరోలా ఉండే ఆ గ్రామం… ఆ ఇద్దరు పోలీసులకు అర్థం కాని మిస్టీరియస్ ప్రశ్నగా మారుతుంది.

రోజులు గడుస్తున్నా వాళ్లు ఆ గ్రామం నుంచి బయట పడలేరు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి అదే దారిలోకి తిరిగి వస్తుంటారు. ఒకే సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయా ? లేక వాళ్లు ఏదైనా వింత ప్రపంచంలో చిక్కుకున్నారా ? అన్న అనుమానం పెరుగుతుంది. ఆ గ్రామం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి ? అక్కడి ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ? చివరకు ఆ ఇద్దరు పోలీసులు బయట పడగలిగారా ? అనే ప్రశ్నలతో సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.

తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

ప్రస్తుతం ‘చురులి’ మూవీ Sony LIVలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి దర్శకుడు ఈ సినిమాను రూపొందించిన తీరు అద్భుతం. సాధారణ కమర్షియల్ థ్రిల్లర్‌లా కాకుండా ప్రేక్షకుడి ఊహాశక్తికి సినిమా పరీక్ష పెడుతుంది. అందుకే ఈ చిత్రం విడుదలైన ఇన్నేళ్లయినా ఇంకా ఆడియన్స్ ఫేవరెట్ లిస్ట్ లో ఉండిపోయింది. సాధారణ హారర్ సినిమాలు కాకుండా… కథ పూర్తయ్యాక కూడా దాని అర్థం గురించి ఆలోచించేలా చేసే సినిమాలు కావాలనుకుంటే ఈ సినిమాను డోంట్ మిస్. ఇందులోని మిస్టరీ, టైమ్ లూప్‌లా అనిపించే సంఘటనలు, గ్రామం చుట్టూ అల్లుకున్న వింత ప్రపంచం ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేస్తాయి. మంచి థ్రిల్లింగ్ మూవీని చూడాలి అనుకుంటే ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. పైగా ఇప్పుడు తెలుగులోనే ఉంది.

Read Also: చీకటి గుహలో ఐదుగురు ఫ్రెండ్స్… వెంటాడే రాక్షస చేప.. తెలుగులో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్.. ఒక్కరోజు 14 సినిమాలు స్ట్రీమింగ్..!

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం… రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్

ప్రాణాలు తీసిన ప్రాంక్… ఓటీటీని షేక్ చేస్తున్న షాకింగ్ టీన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×