Illu Illalu Pillalu ToIlluday Episode july 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నిద్రపోవటం చూసి ఎలాగైనా రీవైంజ్ తీర్చుకోవాలని అనుకుంటుకుంది. నీళ్లు కొట్టి లేపుతుంది. ఏంటక్కా బుద్ధి లేకుండా నిద్రపోతున్న దానిమీద నీళ్లు కొట్టావని ప్రేమ అరుస్తుంది. రెస్ట్ తీసుకోడానికి ఇది ఏమైనా నీ పుట్టిల్లు కాదు కదా.. నిద్రపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని ప్రేమ ఉంటుంది.. ఇంట్లో పని ఏంటి అయినా నాకు పొద్దునే లేచి పని చేసే అలవాటు లేదు ఇక మీద లేవను కూడా అని ప్రేమ ఉంటుంది. పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఇంటి పని చేయాల్సిందే అని శ్రీవల్లి అంటుంది.. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని ప్రేమ అంటుంది. మావయ్య గారు నా చేతికి పెత్తనం ఇచ్చారు కదా.. అందర్నీ దారిలో పెట్టాలి అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి ప్రేమల మధ్య మాటలు యుద్ధం మొదలవుతుంది. నర్మదను కూడా ఒక ఆట ఆడుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ రెడీ అయ్యి వెళ్తుంటే మాయగారండి మీరు ఒక నిమిషం ఆగితే నేను కొన్ని విషయాలు చెప్పాలండి.. అది కూడా మీ ముందర అని అంటుంది. సరే చెప్పమ్మా ఏంటో అని రామరాజు అంటాడు.. వేదవతి కూడా మౌనంగా ఉండిపోతుంది. శ్రీవల్లి ఇంట్లోని వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలి అప్పుడే ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు అని కండిషన్స్ పెడుతుంది. అయితే ఆ కండిషన్స్ విన్న అందరూ షాక్ అవుతారు. రామరాజు కూడా మౌనంగా ఉండడంతో శ్రీవల్లి రెచ్చిపోతుంది.. ఇంట్లో రాజ్యం నాదే అని శ్రీవల్లి సంబరపడిపోతూ ఉంటుంది.
ప్రేమ నర్మదా ఇద్దరూ శ్రీవల్లి పెట్టే టార్చర్ ఎక్కువగా ఉంది. ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని అంటారు. అంతా మావయ్య గారికి జరిగిన అవమానం వల్లే శ్రీవల్లి వెళ్ళిపోవాలనుకునింది అని అనుకున్నారు. అయితే గొడవ జరిగిన తర్వాత శ్రీవల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్లి వచ్చింది ఇదంతా వాళ్ళ అమ్మ ప్లాన్ లాగే ఉంది. ఈ ప్లాన్ వెనకాల ఉన్న ఏదైనా ఉందేమో.. మన కుటుంబాన్ని ఏదైనా చేయాలని అనుకుంటున్నారేమో.. మన ఇంటిని కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది.
మనం ఎక్కడైతే వెతకడం ఆపేసాము అక్కడ నుంచి వెతకాలి. ఇక భాగ్యం ఆనందరావు మాట్లాడుకుంటూ ఉంటారు. లేటు అయితే బిజినెస్ పోతుంది అని తొందరగా సదండి అని అంటాడు. భాగ్యం మాత్రం బిజినెస్ పోయినా పర్లేదు కానీ ఆ నర్మద కంట్లో మాత్రం నువ్వు పడొద్దు. అసలే అది మన మీద తోక తొక్కిన త్రాచు లాగా పగబట్టింది. వేరే దొరికితే మాత్రం మన గుట్టు రట్ట అయిపోతుంది అని అనుకుంటుంది. ఆనంద్ రావు వెళ్లి డోర్ తీయగానే ఎదురుగా రామరాజు కనిపించడం చూసి షాక్ అవుతాడు.
వెనకాలే నర్మద ప్రేమ వచ్చి ఇదండీ మావయ్య గారు వీళ్ళ బాగోతం. అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు అని అంటారు. రామరాజు ఆనంద్ రావు చంప పగలగొడతాడు. అబద్దాలు అడిగి పెళ్లి చేశారా అని రామరాజు కడిగి పడేస్తాడు. అటు వేదవతి కూడా నేనేమైనా మిమ్మల్ని కట్నం అడిగామా మాకు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పారు అని దుమ్ము దులిపేస్తుంది. మాకు అవి ఉన్నాయి. ఇవి ఉన్నాయి అని పెద్ద ప్లాన్ వేశారు. ఇంత మోసం చేస్తారా? మేము ఎవరిని మోసం చేయలేదండి అని భాగ్యం అంటుంది. అప్పుడే చందు ఎవరిని మోసం చేయలేదా పెళ్లి ఖర్చులకోసం నా దగ్గర 10 లక్షలు తీసుకోలేదు అని బయటపెడతాడు.
ఏంట్రా పెద్దోడు నువ్వు చెప్పేది నిజమా అని రామరాజు అడుగుతాడు.. అవును నాన్న మూడు రోజుల ముందు రా పెళ్లి ఖర్చులు లేవు అని.. ఫైనాన్స్లో ఎక్కడ ఇరుక్కున్నాయని అడిగితే నేను వాళ్లకి డబ్బులు ఇచ్చాను. ఇంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు నాన్న అని అంటాడు. ఇక నాకు ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ కూతురిని నా ఇంటికి పంపించారని రామరాజు అంటాడు. ఇక రామరాజు ఆనందరావు తీసుకొని శ్రీవల్లి దగ్గరికి తీసుకెళ్తారు.
వాళ్ల నాన్న చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. నా ఇంటికి దేవత వచ్చింది అనుకున్నాను. 19 కూల్ చేయొచ్చు చీడపురుగు వచ్చిందని అసలు అనుకోలేదు. పెద్దోడా నీ పెళ్ళాన్ని బయటకి ఏంటి రా అని అంటాడు. ఇదంతా నిజం కాదు.. ఆనందరావు కన్న కల.. ఆ కల గురించి భాగ్యం చెప్తే నర్మదకు మన గురించి ఆలోచించకుండా చేసేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాను అని భాగ్యం అంటుంది. నర్మద మాత్రం సాగర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒంటరిగా వస్తూ ఉంటుంది.
ఎదురుగా సాగర్ రావడం చూసి సంతోషపడుతుంది. సాగర్ మాత్రం చూసి చూడనట్టు పక్కన ఉన్న షాప్ కి వెళ్తాడు. మా నాన్న బియ్యం ఇచ్చారంట కదా దానికి డబ్బులు తీసుకురామన్నారు అని అంటాడు. నర్మద నువ్వు పట్టించుకోకుండా అక్కడినుంచి సాగర్ వెళ్లిపోతాడు. నర్మద పిలుస్తున్న కూడా సాగరు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడగానే భాగ్యం కనిపిస్తుంది. నర్మదను భాగ్యం పిలుస్తుంది.
Also Read: ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 14 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్..
నీకు ఎంత కష్టమొచ్చింది అమ్మాయి.. నీ పరిస్థితిని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. కట్టుకున్న భార్య పిలుస్తున్న కూడా మీ భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అంటూ భాగ్యం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంత అవమానం ఇంత అవమానం జరిగిన తర్వాత సిగ్గు శరం ఉన్న ఏ ఆడదైనా భరించలేక చచ్చిపోతారు అని భాగ్యం అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజ్ కి షాక్ ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..