BigTV English

OTT Movie : అక్క లేచి పోవడంతో చెల్లికి వాచిపోయింది… ఇటువంటి మొగుడు ఎవరికీ వద్దు బాబు

OTT Movie : అక్క లేచి పోవడంతో చెల్లికి వాచిపోయింది… ఇటువంటి మొగుడు ఎవరికీ వద్దు బాబు

OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చే లవ్ స్టోరీలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికీ అక్కడ నుంచి వచ్చే రొమాంటిక్ సినిమాలకు మన ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్ ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (YouTube) లో 

ఈ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘ఆకాష్ వాణి’ (Aakash vani). దీనికి లవ్ రంజన్ దర్శకత్వం వహించారు. వైడ్ ఫ్రేమ్ పిక్చర్స్ బ్యానర్‌పై కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భారుచా టైటిల్ పాత్రల్లో నటించారు. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ప్రపంచవ్యాప్తంగా 25 జనవరి 2013న విడుదలైంది. ప్రేమించిన ప్రియుడు, శాడిస్ట్ మొగుడి మధ్య స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ మూవీ యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఆకాష్ ఇంజనీరింగ్ చేయడానికి ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు. అయితే అదే కాలేజీలో వాణి అనే అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది. వాణి కుటుంబం చాలా పద్దతిగా ఉంటుంది. అయినా గాని చదువు కోసం ఆమెను కాలేజీకి పంపిస్తారు. కాలేజీలో ఆకాష్, వాణికి మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదురుతుంది. అలా వీళ్ళ ఫ్రెండ్షిప్ తరువాత ప్రేమగా మారుతుంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఆకాష్ పై చదువులకి అమెరికాకి వెళ్లాలని అనుకుంటాడు. ఈ విషయం తెలిసి వాణి బాధపడుతూ ఉంటుంది. తిరిగి వచ్చాక ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని చెప్పి వెళ్తాడు. ఇంతలోనే వాణి సిస్టర్ కి మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని, లెటర్ రాసి అమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి బాగా ఏడుస్తుంటారు. అదే ముహూర్తానికి వాణిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు ఆమె తల్లిదండ్రులు. వాణి కూడా తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లి చేసుకుంటుంది.

వాణి భర్త మంచిగానే చూసుకుంటూ, సూటి పాటి మాటలు అంటూ ఉంటాడు. మానసికంగా తనని హింసించడం మొదలు పెడతాడు. బయట మంచివాడిగా నటిస్తూ, లోపల ఆమెను బాగా బాధపెడుతూ ఉంటాడు. అతనితో విసిగిపోయి ఒకసారి పుట్టింటికి వచ్చేస్తుంది వాణి. తల్లి దండ్రులు ఆమెకు సర్దిచెప్పాలని చూస్తారు. కాని తన బాధను ఎవరూ అర్థం చేసుకోరు. ఈ విషయం తెలిసి ఆకాష్ చాలా బాధపడతాడు. ఆమెను తనతో రమ్మని చెప్తాడు. అలా జరిగితే తల్లిదండ్రులు ఏమవుతారో అని భయపడుతూ ఉంటుంది వాణి. చివరికి వాణి భర్తతోనే బ్రతుకుతుందా? ఎదిరించి ప్రియుడితో వెళ్ళిపోతుందా? తన జీవితాన్ని ఎవరితో పంచుకుంటుంది? ఈ విషయాలు మీరు  తెలుసుకోవాలనుకుంటే, యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆకాష్ వాణి’ (Aakash vani) అనే ఈ రొమాంటిక్ డ్రామా మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

OTT Movie : పేరుకే 118 ఏళ్ల వృద్ధుడు… ముగ్గురమ్మాయిలతో లవ్ స్టోరీ… మైండ్ బెండయ్యే సై-ఫై మూవీ

OTT Movie : సైకో నుంచి మనుషుల్ని తినే మనిషి వరకు… ఒకే సినిమాలో 6 స్టోరీలు… గుండె గుభేల్మన్పించే హర్రర్ మూవీ

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×