BigTV English

Yashasvi jaiswal : ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి సెంచరీ.. 100 చరిత్రలో ఏకైక క్రికెటర్ గా రికార్డు

Yashasvi jaiswal : ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి సెంచరీ.. 100 చరిత్రలో ఏకైక క్రికెటర్ గా రికార్డు

Yashasvi jaiswal :  ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ తొలిటెస్ట్ లీడ్స్ మైదానం వేదికగా జరుగుతున్న  మొదటి మ్యాచ్ లో  టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ తో టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. అతనికి చటేశ్వర్ పుజారా టెస్ట్ క్యాప్ అందించాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు కొద్దిసేపు మౌనం పాటించారు. టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్ కి దిగగా.. ఓపెనర్  కే.ఎల్. రాహుల్ 42 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేశాడు. 154 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డ పై ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు జైస్వాల్. అలాగే గతంలో వెస్టిండిస్, ఆస్ట్రేలియా జట్ల పై కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి రికార్డు నమోదు చేశాడు యశస్వి జైస్వాల్. ఇలా ఫస్ట్ ఇండియన్ ఓపెనర్ గా రికార్డు నమోదు చేయడం విశేషం.


Also Read :  Watch Video : ఇలాంటి చెత్త ఫీల్డింగ్ కూడా ఉంటుందా.. పాకిస్తాన్ కంటే దారుణం

మరోవైపు కే.ఎల్. రాహుల్ ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ మాత్రం తన తొలి టెస్ట్ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. మరోవైపు కెప్టెన్ శుబ్ మన్ గిల్ ధనాధన్ ఆటతో అలరిస్తున్నాడు. ఈ మ్యాచ్ తోనే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు గిల్. 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్-జైశ్వాల్ జోడీ మూడో వికెట్ కి 129 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియా బ్యాటర్లు ఇదే జోరు కొనసాగించినట్టయితే.. మొదటిరోజు దాదాపు 350 పరుగుల వరకు చేసే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ గడ్డ పై తొలి టెస్ట్ ఇన్నింగ్స్ లోనే సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు. ఇక అంతకు ముందు మురళీ విజయ్ 146,, విజయ్ మంజ్రేకర్ 133, సౌరబ్ గంగూలీ 131, సందీప్ పాటిల్ 129 ఈ ఘనత సాధించారు.


మరోవైపు లీడ్స్ మైదానంలో టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్ గా రికార్డు నెలకొల్పాడు జైస్వాల్. తొలి రోజు 65 ఓవర్లకు 260 పరుగులు చేసింది టీమిండియా. అప్పటికీ మూడు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం భారత బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. ముఖ్యంగ షోయబ్ బషీర్ వేసిన 54వ ఓవర్ మెయిడిన్ కావడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్, వోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రధానంగా పిచ్ కండీషన్స్ వల్ల బంతి బ్యాటర్ మీదకి వస్తుండటంతో సెంచరీ చేసిన  జైస్వాల్ కి పలుమార్లు గాయాలయ్యాయి. అయినప్పటికీ తాను తట్టుకొని టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించడంతో అందరూ అభినందిస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×