E-Paper
Advertisement

ఫర్నిచర్ షోరూమ్‌లో తీయకూడని తలుపు… లోపలికెళ్తే అంతులేని వింత మిస్టరీ

ఫర్నిచర్ షోరూమ్‌లో తీయకూడని తలుపు… లోపలికెళ్తే అంతులేని వింత మిస్టరీ
Advertisement

Horror Thriller on OTT : హర్రర్ మూవీ లవర్స్ ఆకలిని తీర్చడానికి మరో భయంకరమైన సినిమా వచ్చేసింది. రెండు ఓటీటీలలో సందడి చేస్తున్న ఈ మూవీ థియేటర్లలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అదిరిపోయే థ్రిల్ ఇచ్చిన ఈ మూవీ ఏకంగా 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో థియేటర్లను రఫ్ఫాడించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్. 2026లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ సెన్సేషన్ ‘Backrooms’. అసలు ఈ మూవీ కథ ఏంటి ? మూవీ స్ట్రీమింగ్ విషయంలో వచ్చిన ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే స్టోరీలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ మొత్తం 1990లలో సాగుతుంది. క్లార్క్ ఒక ఫర్నిచర్ షోరూమ్ ని నడుపుతాడు. బయటకు వ్యాపారం బాగానే సాగుతున్నట్టు అనిపించినా… లోపలి ప్రపంచం మాత్రం అస్తవ్యస్తంగా ఉంటుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు, మానసిక ఒత్తిడి వల్ల అతను డాక్టర్ మేరీ అనే థెరపిస్ట్ దగ్గర కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను షోరూమ్ బేస్‌మెంట్‌లో పని చేస్తుంటాడు. సడన్ గా క్లార్క్‌కు ఒక వింతైన, సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. ఆ ద్వారం గుండా లోపలికి అడుగు పెట్టగానే అతను ఒక అంతం లేని, పసుపు రంగు గోడలు, ఒకే రకమైన కార్పెట్లు, శబ్దాలు చేసే ఫ్లోరోసెంట్ లైట్లతో నిండిన భయంకరమైన శూన్య ప్రపంచంలోకి వెళ్లిపోతాడు.

Advertisement

ఆ ప్రపంచంలో కాలం, దిక్కు, భౌతిక నియమాలు ఏవీ పని చేయవు. గదులు గదులుగా విస్తరించి, ఒక్కసారి దారి తప్పితే తిరిగి బయటపడడం అసాధ్యం అన్నట్టుగా ఉంటుంది. అక్కడ కేవలం ఏకాంతం మాత్రమే కాదు, భయంకరమైన అదృశ్య శక్తి కూడా వారిని వెంటాడుతుంది. క్లార్క్ కనిపించకుండా పోవడంతో డాక్టర్ మేరీ కూడా అతన్ని వెతుకుతూ ఆ భయంకర ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇక్కడే కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది. బ్యాక్‌రూమ్స్ అనేది నార్మల్ స్థలం కాదు… అది మనసులో దాగి ఉన్న భయాలు, ఒంటరితనం, ఆందోళనలకు ప్రతీక. క్లార్క్ తన గత జ్ఞాపకాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత వైఫల్యాలను ఎదుర్కొంటూ ఆ శూన్య ప్రపంచం నుంచి బతికి బయటపడాలని ప్రయత్నిస్తాడు. మరి అక్కడి నుంచి అనుకున్నట్టే హీరో బతికి బయట పడ్డాడా ? అసలు అతని సమస్య ఏంటి ? డాక్టర్ అతనికి ఎలాంటి హెల్ప్ చేసింది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.

Advertisement

Also Read : అనుకోకుండా హత్య కేసులో చిక్కుకునే ఫ్యామిలీ… మతిపోగొట్టే మలయాళం మిస్టరీ థ్రిల్లర్

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘బ్యాక్ రూమ్’ మూవీ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం 84 కోట్ల బడ్జెట్ తో రూపోండితే, థియేటర్లలో ఏకంగా 3024 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హారర్ జానర్‌లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా చూస్తుంటే మన మనసులో దాగి ఉన్న భయాలు, ఒంటరితనం ఎంత భయంకరంగా మనల్ని వెంటాడతావో అర్థమవుతుంది. యూట్యూబ్‌లో కేన్ పిక్సెల్స్ సృష్టించిన వైరల్ బ్యాక్‌రూమ్స్ లోర్‌ను A24 స్టూడియో అద్భుతంగా బిగ్ స్క్రీన్‌ పైకి తీసుకొచ్చింది. ఈ చిత్రం 2026 జూలై నుంచి Amazon Prime Video, Apple TVలలో ప్రీమియం వీడియో-ఆన్-డిమాండ్ రూపంలో అందుబాటులో ఉంది. అంటే మూవీని చూడాలంటే రెంట్ పే చేయాలి. ఇదే మూవీ స్ట్రీమింగ్ ట్విస్ట్. ప్రస్తుతం ఇంగ్లీష్ ఒరిజినల్ ఆడియోతోనే స్ట్రీమ్ అవుతోంది. మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×