Crime Thriller: ఒక సాధారణ కుటుంబం. ప్రశాంతమైన గ్రామీణ జీవితం. ఎవరి జోలికీ వెళ్లకుండా తమ పని తాము చేసుకునే మనుషులు. అలాంటి కుటుంబాన్ని అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా టార్గెట్ చేస్తే ? నకిలీ సిమ్ కార్డులు, ఐడెంటిటీ థెఫ్ట్ తో వాళ్ల పేర్లను ఉపయోగించి భారీ మోసం చేస్తే ? ఆ నేరం కారణంగా కుటుంబం ఆర్థికంగా కుప్పకూలడమే కాకుండా… ఒక ప్రాణం కూడా పోతే ? పోలీసుల దగ్గరకు వెళ్లినా న్యాయం దొరకని పరిస్థితిలో టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని ఓ సంప్రదాయ యువతి ఏం చేస్తుంది ? ఇదే ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కిన సైబర్ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘అచ్యుత అవతారం’ (Achyuta Avataaram). మరి ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ ? అనేది తెలుసుకుందాం పదండి.
కేరళలోని కాసరగోడ్ ప్రాంతంలో ఒక సంప్రదాయ కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంటుంది. దైవభక్తి, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే ఆ ఇంట్లో ఓ యువకుడు బెంగళూరులో కంప్యూటర్ విద్య పూర్తి చేసి సొంతూరికి తిరిగి వస్తాడు. టెక్నాలజీ ప్రపంచంలో పరిచయం ఉన్న అతను కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాడు. కానీ తెలియకుండానే వారి కుటుంబం పేర్లు, వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. ఐడెంటిటీ థెఫ్ట్, నకిలీ సిమ్ కార్డులు, డిజిటల్ మోసాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పని చేసే ఓ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ ఈ కుటుంబాన్ని భారీ ఆర్థిక మోసంలోకి లాగుతుంది.
ఒక్కసారిగా తమకు సంబంధం లేని నేరానికి ఈ కుటుంబమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బు పోవడంతో పాటు కుటుంబం పరువు, ప్రశాంతత కూడా దెబ్బతింటాయి. పరిస్థితులు మరింత విషమించి కుటుంబంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంటి ప్రపంచమే తలకిందులవుతుంది. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. పోలీసుల ద్వారా, చట్టపరమైన మార్గాల్లో న్యాయం దక్కడం అంత సులభం కాదని గ్రహించిన కుటుంబంలోని ఓ యువతి రంగంలోకి దిగుతుంది. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని ఆమెకు, ఎదురుగా ఉన్నది దేశాలు దాటి పనిచేసే సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్. అయినా వెనక్కి తగ్గకుండా ఆ చీకటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది.
డార్క్ వెబ్, సైబర్ మోసాలు, దొంగిలించిన డిజిటల్ గుర్తింపులు… ఇలాంటి వాటి గురించి తెలియని ఓ సంప్రదాయ యువతి క్రమంగా ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ? ఈ నెట్‌వర్క్‌ను ఎవరు నడుపుతున్నారు ? వాళ్ల దగ్గరికి చేరుకోవాలంటే తాను ఏం చేయాలి ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ముందుకు సాగుతుంది.
ఇక్కడే ‘అచ్యుత అవతారం’ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకవైపు విలేజ్ లైఫ్ స్టైల్, దైవభక్తి, కుటుంబ అనుబంధాలు ఉంటే… మరోవైపు కనిపించని డిజిటల్ ప్రపంచం, సైబర్ నేరాలు, మోసాల నెట్‌వర్క్ ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కథను ఎమోషనల్ థ్రిల్లర్ గా నడిపించారు. తన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్లను ఆ యువతి ఎలా గుర్తించింది ? సైబర్ ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఆమెకే ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి ? అసలు ఈ నేరాల వెనుక ఉన్న అసలు ముఖాలు ఎవరు ? చివరికి ఆ కుటుంబానికి న్యాయం దక్కుతుందా ? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
‘అచ్యుత అవతారం’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మాళవిక నందన్ (Malavika Nandan), అవినాష్ (Avinash), సీమ జి. నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పునీత్ ఆరాధ్య దర్శకత్వం వహించారు.
Read Also: భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా