Action Thriller Series OTT : ఓటీటీలో ఒక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ దుమ్ము లేపుతోంది. 16 ఎపిసోడ్ లతో వచ్చిన ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్టైల్ లో ఉంటోంది. ఇందులో హీరో టాక్సీ డ్రైవర్ గా ఉంటూ నెరస్థుల పని పడుతూ ఉంటాడు. ఈ సిరీస్ కి ఐయండిబిలో 8 కి పైగా రేటింగ్ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు సూపర్ హిట్ కూడా అయ్యాయి. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో చూడొచ్చు అనే వివరాల్లోకి వెళితే…
ఈ క్రైమ్ థ్రిల్లర్ కొరియన్ సిరీస్ పేరు ‘టాక్సీ డ్రైవర్ సీజన్ 3’ (Taxi Driver Season 3). కాంగ్ బో-సీయుంగ్ ఈ సీజన్‌ను డైరెక్ట్ చేశారు. ఈ సీజన్‌లో ప్రముఖ నటి జాంగ్ నారా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇక కిమ్ డో-గి తన విభిన్నమైన గెటప్‌లతో నేరస్తులను బురిడీ కొట్టించడం ఈ సీజన్‌లో కూడా కొనసాగింది. సీజన్ 3లో మొత్తం 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీజన్ Rakuten Viki ప్లాట్ ఫామ్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో దీని అప్‌డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇది వరకే వచ్చిన రెండు సీజన్లు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. 2021లో వచ్చిన సీజన్ 1, మొత్తం 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇక సీజన్ 2 కూడా 16 ఎపిసోడ్‌లతో 2023లో ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు సీజన్ 3, 2025 నవంబర్ 21న ప్రారంభమై, 2026 జనవరి 10న ముగిసింది.
కథ అంతా కిమ్ డో-గి అనే ఒక మాజీ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతని తల్లిని ఒక కిరాతకుడు చంపేస్తే, చట్టం వాడికి సరైన శిక్ష వేయలేకపోతుంది. ఆ కసితో ఉన్న హీరో, ‘రెయిన్బో టాక్సీ’ అనే ఒక రహస్య సంస్థలో చేరతాడు. ఈ సంస్థ పైకి మామూలు టాక్సీ సర్వీస్‌లా కనిపిస్తుంది కానీ, లోపల మాత్రం చట్టం నుండి తప్పించుకు తిరుగుతున్న నేరస్తులకి బుద్ధి చెప్పే రివెంజ్ సర్వీస్ నడుపుతుంటుంది. పగలు మామూలు టాక్సీ డ్రైవర్‌లా తిరిగే హీరో, రాత్రి పూట నేరస్తుల వేట మొదలుపెడతాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి ‘టాక్సీ’ అనేది ఒక మంచి ముసుగు లాగా ఉపయోగపడుతుంది.
ఇక కథలో ప్రమాదకరమైన యాకూజా గ్యాంగ్‌తో హీరో తలపడే సన్నివేశాలు సీజన్ మధ్యలో ఉత్కంఠను పెంచుతాయి. హీరో కూడా ఒక్కో కేసు కోసం ఒక్కో రకమైన గెటప్ వేసి, నేరస్తుల అడ్డాలోకి దూరిపోతుంటాడు. అతనికి సాయంగా ఒక తెలివైన హ్యాకర్ అమ్మాయి, ఇద్దరు మెకానిక్కులు, ఒక రిటైర్డ్ అధికారి ఉంటారు. వీళ్లంతా కలిసి కిడ్నాపర్లు, మోసగాళ్లు, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే విలన్లను కోర్టుకు కాకుండా, తమదైన శైలిలో శిక్షిస్తారు. బాధితుల కన్నీళ్లు తుడిచి, వాళ్లకి ప్రతీకారం తీర్చిపెట్టడమే ఈ ‘టాక్సీ డ్రైవర్’ అసలు కథ.
Read Also : అంధకారాన్ని జయించే అభిమన్యుడు… చావులోనూ చెరగని చిరునవ్వు… హార్ట్ టచింగ్ స్టోరీ