E-Paper
Advertisement

Lalit Modi : ఐపీఎల్ సృష్టిక‌ర్త లలిత్ మోడీ రీ-ఎంట్రీ..కొత్త జ‌ట్టుతో గ్రాండ్ ఎంట్రీ ?

Lalit Modi : ఐపీఎల్ సృష్టిక‌ర్త లలిత్ మోడీ రీ-ఎంట్రీ..కొత్త జ‌ట్టుతో గ్రాండ్ ఎంట్రీ ?
Advertisement

Lalit Modi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్  ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ సృష్టికర్త లలిత మోడీ ( Lalit Modi ) గురించి సంచలన న్యూస్ బయటకు వచ్చింది. అనేక ఆరోపణల నేపథ్యంలో జీవితకాల ఐపీఎల్ నిషేధాన్ని అనుభవిస్తున్న లలిత్ మోడీ, ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే ఈ సారి బోర్డు మెంబర్ గా కాకుండా.. ఓ జట్టు యజమానిగా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

రాజస్థాన్ రాయల్స్ ఓనర్ గా లలిత్ మోడీ రీ ఎంట్రీ ?

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ( Royal Challengers Bangalore team ) పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టును ( Rajasthan Royals Team) వేలానికి పెట్టారు. దీంతో ఈ వేళానికి సంబంధించిన కీలక సమావేశం ఇవాళ సాయంత్రం జరగనుంది. అయితే ఈ జట్టును కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ సిద్ధంగా ఉన్నారని ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే కల్ సోమనీ అనే వ్యక్తితో కలిసి లలిత్ మోడీ బిడ్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క‌ల్ సోమ‌నీ ఇప్ప‌టికే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టులో త‌క్కువ వాటా క‌లిగి ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేయాలంటే రూ. 9,000 కోట్లకు పైగా డబ్బులు ఉండాలి. అయితే ఇందులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే డబ్బులు సిద్ధం చేసుకున్నారట లలిత్ మోడీ. ఒకవేళ అన్ని ఓకే అయితే రాజస్థాన్ రాయల్స్ ఓనర్ గా మారిపోనున్నారు లలిత్ మోడీ.

రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసేందుకు గట్టి పోటీ

విక్రయానికి ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతోపాటు మరో ముగ్గురు బడా వ్యాపారవేత్తలు లైన్ లో ఉన్నారు. అందులో ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా ఉంది. విలువ రాజస్థాన్ రాయల్స్ తో పాటు ఆర్సిబి కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అదర్ పునావాలా కూడా సిద్ధంగా ఉన్నారు. సత్యం గజ్వాని కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. వీళ్ళందరినీ దాటుకొని ఐపిఎల్ సృష్టికర్త లలిత్ మోడీని కచ్చితంగా అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. మరి ఈ రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఐపీఎల్ 2009 సంద‌ర్భంగా ల‌లిత్ మోడీ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. రూ425 కోట్ల స్కాం జ‌రిగింద‌ట‌. అందుకే ల‌లిత్ మోడీపై బ్యాన్ విధించారు.

Advertisement

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×