E-Paper
Advertisement

Crime Thriller OTT: పండుగ రోజున పాడెక్కే మనుషులు… ఉత్కంఠ రేపుతున్న సిరీస్

Crime Thriller OTT: పండుగ రోజున పాడెక్కే మనుషులు… ఉత్కంఠ రేపుతున్న సిరీస్
Advertisement

Crime Thriller OTT : థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇక వీటిని భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. ఈమధ్య ప్రతిభాషలోనూ ఈ కంటెంట్ హైలెట్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ సిరీస్ ఊహించని మలుపులు తిరుగుతూ,  ఉత్కంఠతతో నడుస్తోంది. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం హోలీ పండుగ నాడు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఈ క్రమంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా థ్రిల్లింగ్ గా సాగుతూ ఉంటుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘దేవ్‌ఖేల్’ (Devkhel). చంద్రకాంత్ లతా గైక్వాడ్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. ఇందులో అంకుష్ చౌదరి, ప్రాజక్త మాలి, వీణా జామకర్, మంగేష్ దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 7 ఎపిసోడ్లతో ఈ సిరీస్ ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. మరాఠీ భాషలో రూపొందించబడినప్పటికీ, ZEE5 లో తెలుగు, హిందీ డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కొంకణ్ ఏరియాలో దేవ్‌తాలి అనే ఒక మారుమూల పల్లెటూరు ఉంటుంది. అక్కడ ఒక వింత జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా హోలీ పౌర్ణమి రాత్రి ఎవరో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు. ఆ ఊరి జనం అంతా కలిసి ఇది శంకాసుర అనే రాక్షసుడు చేస్తున్న పని అని, అది దేవుడి శాపం అని భయపడి చస్తుంటారు. ఆ టైమ్‌లోనే ఊర్లోకి కొత్తగా ఒక మొండి పోలీస్ ఆఫీసర్ విశ్వాస్ (అంకుష్ చౌదరి) ఎంట్రీ ఇస్తాడు. ఈ విశ్వాస్‌కి దేవుళ్లు, దయ్యాలు అంటే అస్సలు నమ్మకం ఉండదు. దయ్యం చంపడం ఏంటిరా బాబు.. ఎవడో మనిషే స్కెచ్ వేసి చంపుతున్నాడుని డిసైడ్ అయి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.

కానీ ఊరి జనం మాత్రం అడ్డు తగులుతుంటారు. నువ్వు దేవుడి మీద నింద వేస్తున్నావ్, నీకు కీడు జరుగుతుందిని వార్నింగ్‌లు ఇస్తారు. అయినా సరే తగ్గేదే లే అన్నట్టు ఆ శంకాసుర మిస్టరీ ఏంటో తేల్చడానికి గట్టిగా ఫిక్స్ అవుతాడు విశ్వాస్. చివరికి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ శవం వెనుక ఉన్న అసలు కిల్లర్ ఎవరో కనిపెట్టాడా? నిజంగానే అక్కడ ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? లేక ఆ ఊరి పెద్దలే ఏమైనా ప్లాన్ చేసి జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? అనే విషయాలను, ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇంటి కోసం మామా కోడళ్ళ జగడం… ఎలెక్షన్లతో అలుపెరుగని రణరంగం.. ఓటీటీలోకి వచ్చేసిన బెంగాలీ మూవీ

Tags

Related News

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×