OTT Movie : ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వ్యూస్ దక్కించుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా వీటిని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీ స్టోరీ కర్ణాటక తీర ప్రాంతంలోని, శివపుర అనే ఊరిలో జరిగే వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. సస్పెన్స్ తో మెంటలెక్కించే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఒక అనాథగా పెరిగిన అత్రేయ, పోలీసు అధికారిగా పోస్టింగ్ లో జాయిన్ అవుతాడు. తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలనే ఆశతో శివపుర పోలీసు స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ప్రస్తుతం ఈ గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు పురాణాలలో ఉండే, బ్రహ్మ రాక్షసుడి పనిగా అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. అత్రేయ ఈ హత్యల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ హత్యలలో హంతకుడు చనిపోయిన వాళ్ళ మీద ఒకే రకమైన విషం వాడినట్లు గుర్తిస్తాడు. దీంతో ఈ కేసులో తెలుసుకోవలసిన రహస్యం పురాణాలు కాకుండా, ఇంకా ఏదో రహస్యం ఉందని అనుమానిస్తాడు.
అత్రేయకు తోడుగా, కానిస్టేబుల్ రామప్ప అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇదే సమయంలో బృహతి అనే ఒక జర్నలిస్ట్, తన తండ్రితో కలిసి ఈ హత్యలపై స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, గ్రామంలో తరాలుగా దాగిన రహస్యాలు, అత్రేయ తల్లిదండ్రుల గురించిన సమాచారం బయటపడతాయి. చివరికి అత్రేయ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో కనిపెడతాడా ? శివపుర గ్రామంలో దాగిన రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అధిపత్ర’ (Adhipatra). 2025 లో విడుదలైన ఈ మూవీకి చయన్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో రూపేష్ శెట్టి, జాహ్నవి మహది, రఘు పాండేశ్వర్, ప్రకాష్ తుమ్మినాడు, దీపక్ రాయ్ పణజే వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. అత్రేయ అనే పోలీసు అధికారిగా రూపేష్ శెట్టి, బృహతి అనే జర్నలిస్ట్‌గా జాహ్నవి మహది నటించారు. 2025 ఫిబ్రవరి 7న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.