E-Paper
Advertisement

‘ఇక్కా’ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

‘ఇక్కా’ ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

Courtroom Drama : 29 ఏళ్ల తర్వాత సన్నీ డియోల్ – అక్షయ్ ఖన్నా కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవైటింగ్ మూవీ “Ikka” త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ రావడంతో బాలీవుడ్ మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ మూవీ విశేషాలు ఏంటి ? ఓటీటీలో ఈ మూవీని ఎప్పటి నుంచి చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

3 దశాబ్దాల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో

1997లో వచ్చిన ‘బోర్డర్’ సినిమాలో కలిసి నటించిన ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు “ఇక్క”లో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలోనూ, అక్షయ్ ఖన్నా నెగెటివ్ షేడ్ ఉన్న ముద్దాయి పాత్రలోనూ కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మరి డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

కథ ఏమిటి ?

Advertisement

ఇది ఒక హై-వోల్టేజ్ కోర్ట్‌ రూమ్ డ్రామా. సన్నీ డియోల్ ఒక అనుభవజ్ఞుడైన, ధైర్యవంతుడైన న్యాయవాదిగా నటిస్తారు. అక్షయ్ ఖన్నా ఒక కేసులో ముద్దాయిగా కటకటాల వెనక నిలబడతాడు. కోర్టు హాల్‌ లో ఇద్దరి మధ్య జరిగే తీవ్రమైన వాదోపవాదాలు, మైండ్ గేమ్స్, ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. టీజర్‌ లోనే కనిపించిన “టిక్.. టిక్.. బూమ్” డైలాగ్‌తో అక్షయ్ ఖన్నా ఇచ్చిన కూల్ లుక్, సన్నీ డియోల్ ఆగ్రహంతో “షట్ అప్” అని అరవడం… వంటి సీన్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ కోర్ట్ డ్రామాలో రహస్యాలు, ట్విస్టులు, ఎమోషన్, సస్పెన్స్ అన్నీ కలిపి ఇంటెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతోంది.

డైరెక్ట్ గా ఓటీటీలోకి

ఇందులో సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించగా, దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా సొంతం చేసుకుంది. 2026 జూలై 10న నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్‌లోనే వస్తోంది ఈ మూవీ. అందుకే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘ధురంధర్’లో అక్షయ్ ఖన్నా చూపిన విలనిజం ఇందులోనూ కొనసాగుతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కోర్టు హాల్‌ను షేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి అటు సన్ని డియోల్, ఇటు అక్షయ్ ఖన్నా ఆడియన్స్ అంచనాలను ఈ సినిమాతో ఏ మేరకు అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×