Netflix Upcoming Releases : నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఒక సూపర్ వీక్ తో వస్తోంది. జూన్ 15 నుంచి జూన్ 21 వరకు విడుదల కానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లు ఈ వారం మీ వినోదాన్ని డబుల్ చేయనున్నాయి. కామెడీ నుంచి ఫాంటసీ, డాక్యుమెంటరీ వరకు అన్ని రకాల జానర్లలో ఏదో ఒక మూవీ రిలీజ్ కానుంది. ఈ వారం విడుదల కానున్న కొత్త సినిమాలు, సిరీస్ ల లిస్ట్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Drinking Buddies (జూన్ 15)
చికాగోలోని ఒక కంపెనీలో పని చేసే కేట్, ల్యూక్ మధ్య ఉన్న స్నేహం ఎంత లోతైనదో చూపించే హార్ట్ టచింగ్ కామెడీ-డ్రామా ఇది. కలిసి పని చేస్తున్నప్పుడు ఒకరికొకరు ఎంత ముఖ్యమో గ్రహించడం, ఆ తర్వాత వారి సంబంధం ఏ మలుపు తిరుగుతుంది అనేది ఈ సినిమా ముఖ్యాంశం. తేలికపాటి హాస్యం, ఎమోషన్ కలిపి ఉన్న ఈ చిత్రం వీకెండ్ సాయంత్రం చూడడానికి పర్ఫెక్ట్.
Percy Jackson & The Olympians: The Lightning Thief (జూన్ 15)
రిక్ రియార్డాన్ ప్రసిద్ధ నవల ఆధారంగా వచ్చిన ఫాంటసీ అడ్వెంచర్ ఇది. డిస్లెక్సియా, ADHDతో బాధపడుతున్న పెర్సీ జాక్సన్ తను అర్ధదేవుడు అని తెలుసుకుని, దేవతల ప్రపంచంలోకి అడుగు పెడతాడు. వజ్రాయుధం దొంగిలింపు ఆరోపణలు, దేవతల మధ్య సంఘర్షణ వంటి అంశాలు ఉన్న ఈ మూవీ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది.
Percy Jackson: Sea of Monsters (జూన్ 15)
పెర్సీ జాక్సన్ సిరీస్ లో ఇది రెండవ భాగం. థాలియా త్యాగానికి సార్థకత చేకూర్చడానికి గోల్డెన్ ఫ్లీస్ ను వెతకడానికి పెర్సీ సీ ఆఫ్ మాన్‌స్టర్స్ మీదుగా ప్రయాణం చేస్తాడు. యాక్షన్, అడ్వెంచర్, మిత్రుల బంధం వంటి అంశాలు ఉన్న ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఈ వీక్ సూపర్ ఆప్షన్.
America’s Sweethearts : Dallas Cowboys Cheerleaders Season 3 (జూన్ 16)
డల్లాస్ కౌబాయ్స్ చీర్‌లీడర్స్ జట్టు 2025-26 NFL సీజన్ కు సన్నాహాలు చేస్తున్న వారి రియల్ జర్నీని చూపించే డాక్యుమెంటరీ సిరీస్. కష్టం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ వంటి అంశాలతో ఈ సీజన్ మునుపటి సీజన్ల కంటే మరింత ఇంటెన్స్‌గా ఉంటుంది.
The Hangover (జూన్ 16)
2009లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ. ఒక స్టాండప్ కామెడియన్ కి క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత అతను చేసే విచిత్రమైన, హాస్యభరితమైన ప్రయత్నాలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి.
André Is an Idiot (జూన్ 17)
50 ఏళ్ల వయసులో ఉన్న ఉల్లాసభరితమైన అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రే రిసియార్డి కెరీర్ కోసం చేసే సాహసాలు చూపించే బ్లాక్ కామెడీ డ్రామా. టోనీ బెనా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
I Will Find You (జూన్ 18)
తన మూడేళ్ల కొడుకు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ బరోస్ కథ. జైలులో అతన్ని కలవడానికి వచ్చిన వదిన ఒక బాలుడిని చూపిస్తుంది. ఆ బాలుడు అతని కొడుకులాగే ఉంటాడు. ఇక్కడి నుంచి సస్పెన్స్ పిక్ అప్ అవుతుంది.
The Coloring Book (జూన్ 19)
తన భర్తను కోల్పోయిన తండ్రి, డౌన్ సిండ్రోమ్‌తో ఉన్న తన కుమారుడిని ఒంటరిగా పెంచే కథ ఇది. హృదయాన్ని తాకే ఈ ఫ్యామిలీ డ్రామా విలియం క్యాట్‌లెట్ నటనతో మరింత ప్రత్యేకమైంది.
Oasis (జూన్ 19)
ఈ స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్లో విలాసవంతమైన రిసార్ట్‌లో ఒక యువతి రహస్యంగా అదృశ్యమవడంతో ఉత్కంఠభరితమైన కథ మొదలవుతుంది.
Read Also : డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్