OTT Movie : ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఇప్పుడు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల తగ్గట్టు గానే స్టోరీలను రెఢీ చేసుకుంటున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో లవ్ స్టోరీ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్, టెక్నాలజీ చుట్టూ తిరుగుతుంది. 1997 సంవత్సరంలో ఈ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. కన్నడ ఇండస్ట్రీలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
జీ 5 (Zee 5) లో
ఈ కన్నడ క్రైమ్ మిస్టరీ డ్రామా మూవీ పేరు ‘అగ్నాతవాసి’ (Agnyathavasi). మిస్టరీ జానర్ లో వచ్చిన ఈ సినిమాకు జనార్ధన్ చిక్కన్న దర్శకత్వంలో రూపొందింది. ఏప్రిల్ 11, 2025న థియేటర్లలో విడుదలైంది.ఇందులో రంగయన రఘు,శరత్ లోహితాశ్వ,సిద్దు మూలిమని వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. గురుమూర్తి సినిమాటోగ్రఫీ, చరణ్ రాజ్ సంగీతం ఈ మూవీకి కలిసొచ్చింది. ఈ మూవీ స్టోరీ 1997 లో మలనాడు ప్రాంతంలో, ఒక చిన్న గ్రామంలో జరిగే మిస్టరీ స్టోరీ తో నడుస్తుంది. జీ 5 (Zee 5) లో ఈ మూవీ తొందర్లోనే స్ట్రీమింగ్ కు రాబోతోందని సమాచారం.
స్టోరీలోకి వెళితే
మలనాడు ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో నేరాలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్లే పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇన్‌స్పెక్టర్, సాధారణ రైతు జీవితంలా జీవిస్తూ ఉంటాడు. అయితే 25 సంవత్సరాల తర్వాత, ఈ గ్రామంలో ఒక హత్య జరుగుతుంది.ఇది అక్కడ ఉండే గ్రామస్తులకు షాక్‌ను కలిగిస్తుంది. ఇప్పుడు ఈ కేసును ఇన్‌స్పెక్టర్ విచారించడం ప్రారంభిస్తాడు. అతను ఆ ఊరిలో ఒక పెద్ద మనిషిగా ఉండేవాడు. ఈ హత్యను ఎవరు చేశారో తెలుసుకోవడానికి, ఇన్‌స్పెక్టర్ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో సిద్దు, పావని స్టోరీ కూడా మొదలౌతుంది. పావని అమెరికా లో ఉండే ఒక వ్యక్తిని ఇష్టపడుతుంది. అతడు ఇండియా కి వచ్చి పావని తో పెళ్ళికి సుముఖంగా ఉండడు. ఇంతలో సిద్దు అనే అతను పావనిని లవ్ చేస్తాడు. ఇలా ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా మారుతుంది.
ఆ తరువాత ఆమెరికా లో ఉండే ప్రియుడిని రప్పించడానికి ఒక ప్లాన్ వేస్తుంది పావని. చివరికి ఆ ఊరి పెద్ద మనిషిని హత్య చేసింది ఎవరు ? పావని తన ప్రియుడిని ఇండియా కి రప్పిస్తుందా ? ఇన్‌స్పెక్టర్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని చూడండి. దీనిలో హంతకుడు ఎవరనేదాని కన్నా, ఒక వ్యక్తిని నేరం చేయడానికి దారితీసే మానసిక పరిస్తితులే ఎక్కువగా కనబడతాయి. 1997లో ఐటీ బూమ్ కారణంగా యువత ఉద్యోగాలు, విద్య కోసం అమెరికాకు వలస వెళ్లడం వంటి అంశాలను ఈ కథలో చక్కగా చూపించారు.ఈ సినిమా కన్నడ సినిమా పరిశ్రమలో ఆకట్టుకునే స్టోరీతో, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసింది.
Read Also : మొగుళ్ళను వదిలి ప్రియుళ్లను తగులుకునే అమ్మాయిలు … ఇవేం బో*ల్డ్ సీన్స్ రా నాయనా …