OTT Movie : గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకి, రీసెంట్ గా అదిరిపోయే ఒక సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. బీహార్ లో బిందియా పట్టణంలో ఉండే ఒక బడా దావన్ అనే గ్యాంగ్‌స్టర్ తో స్టోరీ మొదలవుతుంది. ఫ్యామిలీ మాఫియా, పొలిటికల్ గేమ్‌లు, 25 కోట్ల క్యాష్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సిరీస్ సస్పెన్స్ తో ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ ను పెంచుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకివెళ్తే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘బిందియా కే బాహుబలి’ (Bindiya Ke Bahubali) ఒక హిందీ డార్క్ కామెడీ గ్యాంగ్‌స్టర్ వెబ్ సిరీస్. దీనిని రాజ్ అమిత్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో సౌరభ్ శుక్లా, రణవీర్ షోరే, సీమా బిస్వాస్, వినీత్ కుమార్, సాయి తామ్‌హంకర్, షీబా చద్దా, సుశాంత్ సింగ్ లాంటి బలమైన తారాగణం నటించారు. 6 ఎపిసోడ్‌లు, 40–50 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సిరీస్ IMDb లో 6.7/10 రేటింగ్ ను పొందింది. ఈ సిరీస్ 2025 ఆగస్ట్ 8న MX Player, Amazon miniTVలో రిలీజ్ అయ్యింది. హిందీ ఆడియో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో ఫ్రీగానే స్ట్రీమింగ్‌లో ఉంది.
కథలోకివెళ్తే
దావన్ కుటుంబం బీహార్‌లో ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యాన్ని నడుపుతుంది. దీనికి బడా దావన్ నాయకత్వం వహిస్తుంటాడు. ఒక దశలో బడా దావన్ స్థానిక ఎన్నికల్లో రాజకీయ నాయకుడిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని ప్రచారం మధ్యలో ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ దావన్ కుటుంబంలో, బిందియా పట్టణంలో అధికార శూన్యత ఏర్పడుతుంది. ఇది ఒక తీవ్రమైన అధికార పోరాటానికి దారితీస్తుంది.
బడా దావన్ జైలులో ఉండగా, అతని కుమారుడు ఛోటే దావన్ కుటుంబ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రత్యర్థి గ్యాంగ్‌లు, అతని స్వంత కుటుంబంలోని విశ్వాసఘాతక బంధువులు అతని మార్గంలో అనేక అడ్డంకులు సృష్టిస్తారు. ఇక మురళీ అనే ఒక సూపర్‌కాప్ ఈ పరిస్థితిని అదుపుచేయడానికి ప్రయత్నిస్తాడు.
కథలో ఒక ముఖ్యమైన అంశం 25 కోట్ల రూపాయల ఎన్నికల డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ డబ్బు బిందియా భవిష్యత్తును నిర్ణయించగలదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇది కుటుంబంలో, ప్రత్యర్థి గ్యాంగ్‌లలో ఉద్రిక్తతలను పెంచుతుంది. ఛోటే ఈ డబ్బును దాచడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆ డబ్బు చాలా మంది చేతులు మారుతుంది. ఈ సమయంలో మురళీ బిందియాలోని ప్రతి ఒక్కరిపై నిఘా పెడతాడు.
ఈ సిరీస్ బిందియా నది పక్కన ఉన్న భూమి చుట్టూ ఉద్రిక్తతలతో మొదలవుతుంది. ఇక్కడ ఛోటే శాంతి చర్చలు జరపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బడా దావన్ రాజకీయాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నంతో కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. బడా దావన్ జైలులో ఉండగా, కుటుంబ సామ్రాజ్యం చీలిపోతుంది. ఛోటే జనాదరణను సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. బడా దావన్ జైలు నుంచి బయటికి వస్తాడా ? ఛోటే ఈ సామ్రాజ్యాన్ని నడపగలడా ? 25 కోట్ల డబ్బు ఏమవుతుంది ? మురళీ ఈ గ్యాంగ్‌స్టర్ లను అదుపులో పెడతాడా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : భర్త ఇంట్లో ఉండగానే భార్య మాజీ లవర్ ఎంట్రీ… నెక్స్ట్ ట్విస్టుకు బుర్రపాడు… కడక్ డార్క్ కథ మావా