BigTV English

Odela 2: ‘ఓదెల 2’లో అవన్నీ ఉంటాయి.. ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన తమన్నా

Odela 2: ‘ఓదెల 2’లో అవన్నీ ఉంటాయి.. ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన తమన్నా

Odela 2: ఈరోజుల్లో ఒక సినిమా హిట్, అయినా ఫ్లాప్ అయినా దానికి సీక్వెల్ తెరకెక్కించడం కామన్ అయిపోయింది. అలా ప్రేక్షకులు అస్సలు ఊహించని ఎన్నో సీక్వెల్స్ వారి ముందుకొచ్చి ఆకట్టుకున్నాయి. అలాంటి ఒక సీక్వెల్ ‘ఓదెల 2’. లాక్‌డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలయిన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ సినిమాను ప్రేక్షకులు హిట్ చేశారు. అయితే అప్పుడు ఈ మూవీకి ఒక సీక్వెల్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటిది దీనికి సీక్వెల్ కన్ఫర్మ్ చేసి, అందులో తమన్నా హీరోయిన్ అనగానే అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ‘ఓదెల 2’ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది తమన్నా.


కొత్త ఎక్స్‌పీరియన్స్

‘ఓదెల 2’లో తమన్నా హీరోయిన్ అని చాలాకాలం క్రితమే అనౌన్స్‌మెంట్ వచ్చింది. దానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. కానీ ఫస్ట్ లుక్ తర్వాత చాలాకాలం పాటు అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా రూమర్స్ వినిపించాయి. కానీ ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ తాజాగా ‘ఓదెల 2’కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో అఘోరీ పాత్రలో తమన్నా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇన్నేళ్ల తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని పాత్రతో ప్రయోగం చేస్తోంది తమన్నా. దీంతో ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఆడియన్స్‌తో పంచుకుంది.


ఈతరం సినిమా

‘‘ఓదెల 2 (Odela 2) ఒక ఫ్యాంటసీ మూవీ. ఇది ఒక మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దాంతో పాటు ఒక సూపర్ నేచురల్ బ్యాక్‌డ్రాప్‌తో కలిసిన ఆధ్యాత్మికత కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు ఇలాంటి సినిమాలంటే ఇష్టం. ఎందుకంటే ఇలా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాలను చూస్తూనే నేను పెరిగాను. ఈ సినిమా కాశీ వరకు చేరింది. ఇది ఈతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా. ఈరోజుల్లో సమాజంలో ఎదురయ్యే సమస్యలపై తెరకెక్కిన సినిమా. ఇది మీకు చాలా హై ఇస్తుంది’’ అంటూ ‘ఓదెల 2’పై అంచనాలు మరింత పెరిగేలా మాట్లాడింది తమన్నా. అంతే కాకుండా ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని చెప్పుకొచ్చింది.

Also Read: ఆ బాధ తలుచుకుంటే ఇప్పటికీ నరకమే.. ప్రెగ్నెన్సీ జర్నీపై ఎమోషనల్ అవుతున్న ప్రముఖ నటి..

సినిమాలే నమ్మకం

‘‘సినిమాలు అనేవి ప్రేక్షకుల్లో ఆలోచన కలిగించాలి అన్నదే నా ఉద్దేశ్యం. అవి మీలో నమ్మకం కలిగించాలి. అందుకే నేను యాక్టర్ అయ్యాను. సినిమాలే నాలో నమ్మకం కలిగించి నన్ను యాక్టర్ చేశాయి. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించాలి’’ అని చెప్పుకొచ్చింది తమన్నా (Tamannaah). అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓదెల 2’ను సంపద్ నంది నిర్మిస్తున్నాడు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్టతో పాటు మరికొందరు నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఫస్ట్ పార్ట్‌లో విలన్‌గా కనిపించిన వశిష్ట.. ఈ సీక్వెల్‌లో కూడా విలన్‌గా కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. తన పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×