Sci Fi Action Movie OTT : చెత్త కుప్పలో ఓ అమ్మాయి దొరుకుతుంది. కానీ కళ్లు తెరిచిన తర్వాత ఆమెకు తన గతమే గుర్తు ఉండదు. ఫైటింగ్ మొదలు పెడితే మాత్రం ఎదుటి వాళ్లను చితక్కొట్టేస్తుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు ? ఆమెకు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ? అనే ప్రశ్నలకు సమాధానమే ‘Alita Battle Angel’ మూవీ. సైబర్‌పంక్ ప్రపంచం, మెమరీ లాస్, అదిరిపోయే యాక్షన్ వంటి అంశాలున్న ఈ మొదలైన దగ్గర నుంచి అలీటా గతం ఏంటనే ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
ఫ్యూచర్ లోని ఐరన్ సిటీలో డాక్టర్ ఇడోకు ఓ సైబోర్గ్ అమ్మాయి తల చెత్త కుప్పలో కనిపిస్తుంది. ఆమెను వదిలేయకుండా ఇంటికి తీసుకెళ్లి కొత్త బాడీ ఇస్తాడు. ఆమెకు అలీటా అని పేరు పెడతాడు. కానీ అలీటాకు తన గతం గురించి ఏమీ గుర్తుండదు. తాను ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చింది ? అనే విషయాలు తెలియవు. మొదట సాధారణ అమ్మాయిలా కనిపించినా… ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం ఆమెలో దాగి ఉన్న శక్తి బయట పడుతుంది.
తనకు తెలియకుండానే అలీటా అద్భుతమైన ఫైటింగ్ స్కిల్స్ చూపిస్తుంది. దీంతో తన గతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆమెకు పెరుగుతుంది. ఆ వెతుకులాటలో ఆమె ఎవరో కాదు… వందల ఏళ్ల క్రితం సృష్టించబడిన అత్యంత శక్తివంతమైన యోధురాలని తెలుస్తుంది. అయితే ఆమె గతం బయటపడుతున్న కొద్దీ శత్రువులు కూడా దగ్గరవుతారు. ఐరన్ సిటీలో ఉన్న పవర్ సిస్టమ్, ప్రమాదకరమైన యోధులు, మోటార్ బాల్ పోటీలు… అన్నీ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇస్తాయి.
తనకు గతం గుర్తులేకపోయినా, తనలో ఉన్న ఫైటర్ ను మాత్రం మర్చిపోలేదు. అందుకే తనను అడ్డుకునే వాళ్లతో ఒక్కొక్కరిగా పోరాడుతూ తన అసలు గుర్తింపును తెలుసుకునే ప్రయాణం మొదలు పెడుతుంది. మరి ఆ ప్రయాణం ఎలా సాగుతుంది ? అసలు అ అమ్మాయి ఎవరు ? ఆ ఫైటింగ్ స్కిల్స్ ఎలా వచ్చాయి ? చివరకు ఏమవుతుంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. సినిమాలో యాక్షన్ మాత్రం కావలసినంత ఉంటుంది. యాక్షన్ ప్రియులకు ఫుల్ ఐ ఫీస్ట్.
Also Read : అమ్మబాబోయ్ అపార్ట్మెంట్ మొత్తం క్రిమినల్సే… ఒక్కో ఫ్లోర్ లో పిచ్చెక్కించే ట్విస్టులు… తోపు సినిమా మావా
‘అలిటా బ్యాటిల్ ఏంజిల్’ మూవీకి Robert Rodriguez దర్శకత్వం వహించారు. Rosa Salazar అలీటాగా, Christoph Waltz డాక్టర్ ఇడోగా, Jennifer Connelly, Mahershala Ali తదితరులు నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 14న అమెరికాలో విడుదలైంది. ప్రస్తుతం JioHotstarలో తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.