BigTV English
Advertisement

Pushpa 2 OTT Date : జనవరి 10 నుంచి ప్రైమ్‌లో పుష్ప 2… ఇందులో నిజమేంతా..?

Pushpa 2 OTT Date : జనవరి 10 నుంచి ప్రైమ్‌లో పుష్ప 2… ఇందులో నిజమేంతా..?

Pushpa 2 OTT Date : పుష్ప2 మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. డిసెంబర్ 4న బెన్ ఫిట్ షోల రూపంలో రాత్రి 9:30 గంటలకే పుష్ప 2 సినిమా థియేటర్స్ లోకి ఏంట్రీ ఇవ్వబోతుంది. ఇక డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేయబోతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రికార్డులు బ్రేక్ అవ్వాలంటే… థియేటర్స్‌లో లాంగ్ రన్ ఉండాలి. కానీ, పుష్ప 2 కు థియేటర్‌లో లాంగ్ రన్ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. దీనికి కారణం… అమెజాన్ ప్రైమ్‌తో పుష్ప 2 మేకర్స్ చేసుకున్న డీల్. ఆ డీల్ ఏంటి..? పుష్ప 2 ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందో ఇప్పుడు చూద్ధాం…


పుష్ప 2… రిలీజ్ కంటే ఎక్కువ అల్లు వర్సెస్ మెగా వార్ ట్రెండింగ్‌లో ఉంది సోషల్ మీడియాలో. దీని వల్ల సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడే ఛాన్స్ ఉందని ట్రెండ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే. ఇదిలా ఉండగా, పుష్ప 2 మేకర్స్ చేసుకున్న ఓటీటీ డీల్ కూడా కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపించబోతుందని తెలుస్తుంది.

పుష్ప 2 మేకర్స్ ఓటీటీ డీల్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లతో చేసుకున్నారని సమాచారం. ఈ సినిమాను ప్రైమ్ వీడియో వాళ్లు అత్యంత భారీ రేట్ కు దక్కించుకున్నారట. మేకర్స్ అడిగినంత ఇవ్వడంతో ప్రైమ్ వీడియో వాళ్లు కొన్ని కండీషన్స్ పెట్టారని టాక్ వినిపిస్తుంది. ఈ కండీషన్స్ ప్రకారం… పుష్ప 2 మూవీ 5 వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందట. రిలీజ్ తర్వాత 5 వారాలు  అంటే… జనవరి 10న, సంక్రాంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తుంది. భారీ డీల్‌ కాబట్టి… జనవరి 10 కంటే ముందే వచ్చే ఛాన్స్ లేకపోలేదని టాక్.


గేమ్ ఛేంజర్‌కి పోటీగా….

జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు పోటీగానే సంక్రాంతి కి పుష్ప 2 మూవీ ఓటీటీలోకి రాబోతుందని కామెంట్స్ వస్తున్నాయి. కారణం ఏదైనా ఉండొచ్చు కానీ, సరిగ్గా గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే డేట్ కే పుష్ప 2 మూవీ ఓటీటీ స్ట్రీమ్ అయితే అలాంటి కామెంట్సే రావడం సహజం.

జనవరి 10 కాకపోతే మరో డేట్…

అమెజాన్ ప్రైమ్ వీడియో, పుష్ప 2 నిర్మాతలకు మధ్య ఒప్పందం ప్రకారం పుష్ప 2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ జనవరి 10 నుంచే ఉండబోతుందని తెలుస్తుంది. ఒకవేళ ఆ డేట్ కి కుదరకపోతే, జనవరి 25 లోపు కచ్చితంగా స్ట్రీమ్ కానుందని సమాచారం. జనవరి 23కి పుష్ప 2 రిలీజ్ అయి 50 రోజులు అవుతుంది. 50 డేస్ ఈవెంట్ చేసిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×