Pushpa 2 Pre Release : టాలీవుడ్ లో “పుష్ప 2” సినిమా రిలీజ్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మెగా ఫ్యామిలీతో విభేదాల కారణంగా సొంత గడ్డపైనే అల్లు అర్జున్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా పిలవాలని “పుష్ప 2” (Pushpa 2 )నిర్మాతలు అనుకోగా, ఇటు చిరు… అటు పవన్ కి ఫ్యాన్స్ అల్టిమేటటం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో చిరు చేతులెత్తేశారని అంటున్నారు.
‘పుష్ప 2’ డిసెంబర్ 5న భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. టాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా రిలీజ్ విషయంలో వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేకర్స్. దానికి కారణం మెగా అభిమానులు. ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో అల్లు వర్సెస్ మెగా వివాదం మరింతగా ముదురుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ ‘పుష్ప 2’ (Pushpa 2)ట్రెండింగ్ లో ఉంది. అలాగే ‘పుష్ప 2’ టికెట్స్ కొనడానికి మెగా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తి చూపించట్లేదని వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో అసలు ఈ ‘పుష్ప 2’పై ఎలా ఉండబోతోందో అనే టెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున జరగబోతోంది. అయితే ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా పిలిస్తే పరిస్థితులు చక్కబడతాయని ‘పుష్ప 2’ (Pushpa 2)మేకర్స్ భావించారు. అందులో భాగంగానే ఈ రోజు చిరంజీవి (Chiranjeevi)ని కలిసి, ఈవెంట్ కి ఆహ్వానిద్దామని వెళ్లబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కి అభిమానులు అల్టిమేటం ఇచ్చినట్టుగా టాక్ బయటకు వచ్చింది.
ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం… చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి అభిమానులు ముందే ఈ విషయమై అల్టిమేటం ఇచ్చారట. ‘బన్నీ ఈవెంట్ కి వెళ్తే ఇక అంతే పని.. మీకు కూడా గుడ్ బై’ అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారట . అంతేకాదు ‘ మేము ఇక్కడ కొట్టుకుంటుంటే, మీరు మీరు కలిసిపోతారా?’ అని సూటిగా ప్రశ్నించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి ‘పుష్ప 2’ మేకర్స్ ని కలిసే ఛాన్స్ లేకుండా షూటింగ్ సెట్ కి వెళ్ళిపోయారని అంటున్నారు. విశ్వంభర సినిమా సెట్స్ కి వెళ్లాడని, అక్కడ చిరు పార్ట్ షూటింగ్ లేకపోయినా.. అక్కడకి వెళ్లి క్యారీవాన్‌లో కూర్చున్నాడు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే కచ్చితంగా అల్లు అర్జున్ కు బిగ్గెస్ట్ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. మిగతా స్టేట్స్ లో ‘పుష్ప 2’ సంగతి ఎలా ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ అయ్యాక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ వివాదం ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ పై పడబోతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చిరు ఇలా ముఖం చాటేస్తే ‘పుష్ప 2′ (Pushpa 2)’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోయేది ఎవరు? పుష్ప రాజ్ ఈ పరిస్థితిని ఎలా ఎదురుకోబోతున్నాడు? మెగా వర్సెస్ అల్లు వివాదం ఇలాగే కంటిన్యూ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యి, రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.