Nitish Kumar Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా.. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఏడు మ్యాచులు కూడా చాలా రసవత్తరంగా కొనసాగాయి. ఇక నిన్న ఏడవ మ్యాచ్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్లు పెద్దగా రాణించలేదు.
Also Read: SRH VS LSG: చుక్కలు చూపించిన LSG… డిప్రెషన్ లోకి కావ్య పాప ?
దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి ఓటమిని మూటగట్టుకుంది. అయితే.. ఈ మ్యాచ్లో హైదరాబాద్ దారుణంగా ఓడిపోవడంతో… ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో వికెట్ కోల్పోయిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి… పెవిలియన్ కు వెళ్లేటప్పుడు తీవ్ర ఆగ్రహంతో వెళ్లిపోయాడు. తన హెల్మెట్ తీసి నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 32 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి… కాస్త స్లోగానే ఆడాడు. ఇందులో కేవలం రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి.
అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త మెల్లగా… రవి బిస్నోయి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వికెట్ కోల్పోయిన తర్వాత వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసి నేలకేసి కొట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఇలా వ్యవహరించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిత్యం… కూల్ గా అలాగే హ్యాపీగా కనిపించే నితీష్ కుమార్ రెడ్డి లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని అభిమానులు అవాక్కవుతున్నారు.
Also Read: David Warner: SRH 300 కొట్టడం పక్కా… డేవిడ్ వార్నర్ సంచలన పోస్ట్ !
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే… ఈ మ్యాచ్లో హైదరాబాద్ టాస్ ఓడినప్పటికీ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 300 పరుగులు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ 200 పరుగులు కూడా చేయలేక పోయింది హైదరాబాద్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… కేవలం 190 పరుగులు చేసింది. హెడ్, కెప్టెన్ పాట్ కమీన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, క్లాసెన్ లాంటి ప్లేయర్లు మెరిసినప్పటికీ స్కోరు మాత్రం పెద్దగా రాలేదు.
ఇక హైదరాబాద్ విధించిన 191 పరుగుల లక్ష్యాన్ని…. అవలీలగా చేదించింది లక్నో సూపర్ జెంట్స్. 2024 సంవత్సరంలో కేఎల్ రాహుల్ సారథ్యంలో హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోయింది. అప్పుడు హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇక తాజాగా అదే తరహాలో ప్రతికారం తీర్చుకుంటూ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించారు లక్నో బ్యాటర్లు. దీంతో 16.1 ఓవర్లలోనే.. మ్యాచ్ ఫినిష్ చేశారు లక్నో బ్యాటర్లు. దీంతో ఐదు వికెట్లు తేడాతో లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టింది. పూరన్, మార్ష్ అద్భుతంగా ఆడటంతో అవలీలగా గెలిచింది లక్నో.
Tough night 😬 #SRHvLSG pic.twitter.com/jtSy0rBOuy
— Nitish Kumar Reddy (@NitishKReddy) March 27, 2025