E-Paper
Advertisement

ఒకే అపార్ట్మెంట్లో చిక్కుకుపోయే జంట… కట్ చేస్తే స్పైన్ చిల్లింగ్ ట్విస్ట్

ఒకే అపార్ట్మెంట్లో చిక్కుకుపోయే జంట… కట్ చేస్తే స్పైన్ చిల్లింగ్ ట్విస్ట్
Advertisement

Mystery Thriller Series: ఒకే అపార్ట్మెంట్లో ఓ జంట ఎక్కువ రోజులు చిక్కుకుపోతే ఏమవుతుంది ? మొదట్లో ఎలా ఉన్నా నెమ్మదిగా ఆ పరిచయం స్నేహంగా, అక్కడి నుంచి ప్రేమగా టర్న్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో మాత్రం కథ ఊహించని షాకింగ్ ట్విస్ట్ తో సాగుతుంది. ప్రేమ కథగా కాదు భయంకరమైన మర్డర్ కేసుగా మారుతుంది. ఆ సిరీస్ మరేదో కాదు… 2026లో విడుదలై అమెరికన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌లో సంచలనం సృష్టించిన 56 డేస్ (56 Days). కేథరిన్ ర్యాన్ హోవార్డ్ రాసిన పాపులర్ నవల ఆధారంగా అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మించిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

బోస్టన్ నగరంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఓ సూపర్ మార్కెట్‌ లో ఒలివర్ కెన్నెడీ, సియారా వైస్ అనే ఇద్దరు అపరిచితులు అనుకోకుండా కలుసుకుంటారు. మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతుంది. ఎంత వేగంగా ఇద్దరి మధ్య అట్రాక్షన్ పెరిగిందో, అంతే వేగంగా ఇద్దరూ తీవ్రమైన ప్రేమలో పడతారు. వారి మధ్య కెమిస్ట్రీ అంత బలంగా ఉంటుంది మరి. అందుకే రెండు వారాల పరిచయంతోనే ఒకే అపార్ట్‌మెంట్‌ లో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

కానీ ఈ బంధం మనం అనుకున్నట్టు నార్మల్ ఫస్ట్ లవ్ కాదు. ఒలివర్, సియారా ఇద్దరూ తమ గతాలను ఒకరి దగ్గర మరొకరు దాచి పెడుతూ ఉంటారు. ఇద్దరి వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంటుంది. కలిసి జీవించడం మొదలు పెట్టిన తర్వాత, వాళ్ళ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపించడం స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 56 రోజుల తర్వాత ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. వాళ్ళ లగ్జరీ అపార్ట్‌మెంట్ బాత్‌టబ్‌లో ఒక గుర్తు తెలియని శవం కనిపిస్తుంది.

ఆ శవం కుళ్లిపోయి, ముక్కలు ముక్కలుగా కోసేసి ఉంటుంది. ఆ శవం ఒలివర్ దా ? సియారాదా ? లేదా మూడో వ్యక్తిదా ? అనే అనుమానాలతో డిటెక్టివ్ లీ రియర్డన్, కార్ల్ కొన్నోలీ ఈ కేసును దర్యాప్తు చేయడం షురూ చేస్తారు. ఈ దర్యాప్తు సమయంలో ఒలివర్, సియారాకు సంబంధించిన భయంకరమైన సీక్రెట్స్ బయటకు వస్తాయి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, కొత్త అనుమానం, కొత్త రహస్యం బయట పడుతూ ఉంటాయి. అసలు ఎవరు హంతకుడు ? ఎందుకు హత్య చేశారు ? ఆ 56 రోజుల్లో నిజంగా ఏమైంది ? అనే ప్రశ్నలు చివరి ఎపిసోడ్ వరకు ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తుతాయి.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

థ్రిల్లర్ మూవీ లవర్స్ కు మస్ట్ వాచ్ సిరీస్ ఈ ’56 డేస్’. అవాన్ జోగియా, డోవ్ కామెరాన్ కెమిస్ట్రీ సిరీస్‌కు ప్రాణం పోసింది. ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్లు ఇష్టపడేవారు మాత్రం ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు. ఇంకా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. అందులోనూ తెలుగులో ఉందనే విషయం మర్చిపోవద్దు.

Read Also: ఈ పొగ పీలిస్తే పోతారు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్

Related News

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు

Big Stories

Advertisement
×