E-Paper
Advertisement

ఈ పొగ పీలిస్తే పోతారు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్

ఈ పొగ పీలిస్తే పోతారు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్
Advertisement

Sci fi Crime Thriller : పొగ ఎక్కువగా పీలిస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ తనను నాశనం చేసిన వారిని ఓ మనిషి ఆవిరిగా మారి, విషవాయువు రూపంలో శత్రువులను నాశనం చేస్తే ఎలా ఉంటుంది ? మామూలుగా అయితే ఇదేమీ సాధ్యం అయ్యే పని కాదు. కానీ ‘హ్యూమన్ వేపర్’ (Human Vapor) అనే సినిమాలో దాన్ని నిజం చేసి చూపించారు. వాయువుగా మారి సమాజంపై పగ తీర్చుకునే వ్యక్తి థ్రిల్లింగ్ కథ ఇది. 2026 జూలై 2న ఓటీటీ విడుదలై భారీ సంచలనం సృష్టించిన ఈ జపనీస్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను… 1960లో వచ్చిన క్లాసిక్ జపనీస్ సినిమా ఆధారంగా, ‘ట్రైన్ టు బుసాన్’ దర్శకుడు యాన్ సాంగ్-హో రూపొందించారు. ఈ 8 ఎపిసోడ్ ల సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో చూడొచ్చా ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

సిరీస్ ఒక షాకింగ్ లైవ్ టీవీ హత్యతో మొదలవుతుంది. ప్రముఖ సైన్స్ ప్రొఫెసర్ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటాడు. అంతలోనే వింత పొగ (వేపర్) స్టూడియోలో ఆవరిస్తుంది. లైవ్ లో అందరూ చూస్తుండగానే ఆ ప్రొఫెసర్ శరీరం ఒక్కసారిగా ఉబ్బి పేలిపోతుంది. ఈ దారుణాన్ని చేసిన వ్యక్తి తనను తాను “హ్యూమన్ వేపర్” అని ప్రకటించుకుంటాడు. అతను వాయువుగా మారి ఏ గోడలనైనా, అడ్డంకులనైనా సులభంగా దాటగలడని, ఇకపై వరుస హత్యలు చేయబోతున్నానని పోలీసులకు సవాల్ విసురుతాడు. ఈ అసాధారణ కేసును పరిష్కరించడానికి సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ డిటెక్టివ్ కెంజీ ఒకమోటో రంగంలోకి దిగుతాడు.

Advertisement

ఆ లైవ్ హత్యను కళ్లారా చూసిన ధైర్యవంతురాలైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్యోకో కోనో ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్ కి తోడుగా వస్తుంది. హ్యూమన్ వేపర్ ప్రముఖులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు పట్టుకుంటాయి. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం బయట పడుతుంది. కెంజీ, క్యోకో దర్యాప్తులో గతంలో ఒక ఉల్క భూమిపై పడుతుంది. దాని వ్యర్థాలను క్లియర్ చేయడానికి “వైట్ సెంటర్” అనే నకిలీ స్వచ్ఛంద సంస్థ ముందుకొస్తుంది.

ఆ సంస్థ పేదలు, అనాథలను ఉపయోగించి రహస్యంగా ప్రయోగాలు చేసి ఉంటుంది. ఆ ప్రయోగాల్లో రెన్ అనే అమాయకుడి శరీరం పూర్తిగా నాశనమై, అతను విషవాయువుగా మారే భయంకర శక్తిని పొందాడు. ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. రెన్ ఈ హత్యలు తన స్వంత నిర్ణయంతో చేయడం లేదు. చిన్నతనంలో అనాథగా ఉన్న క్యోకోను రెన్ తండ్రిలా చేరదీసి పెంచాడు. వైట్ సెంటర్ కుట్రలో పాల్గొన్న అధికారుల జాబితాను క్యోకోనే రెన్‌కు ఇచ్చి, ఈ పగ తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకుంటోంది.

Advertisement

మరోవైపు గవర్నర్ మియురా హ్యూమన్ వేపర్ శక్తులను తన స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి రెన్ శత్రువుల పని ఎలా పట్టాడు ? చివరికి అతన్ని బంధించగలిగారా ? బుర్ర బద్దలయ్యే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది చూసి తెలుసుకోవలసిన స్టోరీ. ఇక ‘హ్యూమన్ వేపర్’ ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది. గుడ్ న్యూస్.ఏంటంటే ఈ సిరీస్ తెలుగులోనూ ఉంది.

Read Also : కళ్ల ముందే గ్యాంగ్‌స్టర్‌తో భార్య బాగోతం… ఈ కొరియన్ సిరీస్ ను చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×