Sankranthiki Vasthunnam: తెలుగులో ఏ హీరో సినిమా విడుదలయినా కూడా ఇతర హీరోలు సపోర్ట్‌గా ముందుకొస్తారు. ఒక హీరో సపోర్ట్ మరొక హీరోకు ఎప్పుడూ ఉంటుంది. కానీ అందరికంటే ముందుగా వారికి మహేశ్ బాబు సపోర్ట్ ఉంటుంది. ఒక మూవీ రిలీజ్ అయినా.. ఒక ట్రైలర్ రిలీజ్ అయినా.. ఏదైనా కూడా దానిని మహేశ్ బాబు చూసి, తనకు నచ్చిందంటే చాలు.. కచ్చితంగా దాని గురించి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి వారికి విషెస్ చెప్తారు. అలా మహేశ్ ట్వీట్స్ వల్లే బజ్ క్రియేట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నం’ విషయంలో కూడా మహేశ్ తన మొదటి రివ్యూను అందించాడు.
ఫస్ట్ రివ్యూ
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటించిన హ్యాట్రిక్ చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). మరోసారి ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేయనుంది అనిల్, వెంకీ కాంబో. పాటలతో ప్రమోషన్స్ ఎప్పుడో ప్రారంభించినా కూడా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. దీంతో ఆడియన్స్‌లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగిపోయింది. ఇంతకాలం వెయిట్ చేయించిన తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్‌ను లాంచ్ చేయించింది మూవీ టీమ్. దీంతో ట్రైలర్‌ను లాంచ్ చేసిన తర్వాత సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూను కూడా తానే అందించారు మహేశ్.
Also Read: వింటేజ్ వెంకీ మామ ఈజ్ బ్యాక్.. ట్రైలర్ అదిరిపోయింది
గుర్తుండిపోయే సంక్రాంతి
‘కచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. నా పెద్దోడు వెంకటేశ్ గారు, నా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలోని సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ అదిరిపోయే హ్యాట్రిక్ దక్కాలని, మూవీ టీమ్ అందరికీ ఇది గుర్తుండిపోయే సంక్రాంతి కావాలని కోరుకుంటున్నాను. జనవరి 14 కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేశ్ బాబు. ఇక ఏ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా దానికి తన సపోర్ట్ ఇవ్వడం మాత్రం మహేశ్ బాబు (Mahesh Babu) ఎప్పుడూ మిస్ అవ్వరంటూ తన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హ్యాట్రిక్ హిట్
ఇప్పటికే వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చే మరో సినిమా కూడా ఈ ఫ్రాంచైజ్‌లో భాగమే అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా కాకుండా భార్య, మాజీ ప్రియురాలు మధ్య నలిగిపోయే భర్త క్యారెక్టర్‌లో వెంకటేశ్‌ను పరిచయం చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు అనిల్. ఇక తాజాగా విడుదలయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరొక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌తో వచ్చి అనిల్ రావిపూడి దర్శకుడిగా తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తాడని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.