Animated Sc iFi Adventure: కుటుంబం కోసం కష్టపడుతూ జీవితాన్ని గడుపుతున్న ఓ తండ్రి… గతంలో తాను సీక్రెట్ ఏజెంట్ గా పని చేసిన విషయాన్ని దాచి పెట్టి ఉంటాడు. కానీ ఒక్కసారిగా అతడి కూతురిని ఏలియన్స్ కిడ్నాప్ చేస్తే గతాన్ని మళ్లీ బయటకు తీసుకురాక తప్పదు. కూతురిని కాపాడటంతో పాటు ప్రపంచాన్నే కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు ? యాక్షన్, ఏలియన్స్, సీక్రెట్ ఏజెంట్ మిషన్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ ఉన్న యానిమేషన్ మూవీ ‘పాపా జోలా: ది మూవీ’ (Papa Zola: The Movie). మరి చిన్న పిల్లలతో పాటే పెద్దలకు కూడా ఆసక్తికరంగా అనిపించే ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
పాపా జోలా కుటుంబాన్ని తండ్రి చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటాడు. తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటూ రకరకాల పనులు చేస్తుంటాడు. కుటుంబంతో కలిసి ఓ మంచి వెకేషన్ కు వెళ్లాలన్నది అతడి కల. అందుకోసం డబ్బు కూడబెట్టుకుంటూ, అందరిలాగే కలలు కంటూ, ఓ సాధారణ తండ్రిలాగే జీవిస్తుంటాడు. కానీ పాపా జోలా జీవితంలో ఒక రహస్యం ఉంటుంది. గతంలో అతడు ‘పి.ఏ.పి.ఏ’ (P.A.P.A) అనే రహస్య సంస్థలో పని చేసిన సీక్రెట్ ఏజెంట్.
ఆ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత తన గతాన్ని దూరంగా పెట్టేస్తాడు. అయితే ఓ రోజు పాత పరిచయం అతడి జీవితాన్ని మళ్లీ మార్చేస్తుంది. ఇంతలో అతడి కూతురు పిపి జోలాను ఏలియన్స్ కిడ్నాప్ చేస్తారు. కూతురిని తిరిగి తీసుకు రావాలంటే పాపా జోలా తనలో దాచుకున్న పాత ఏజెంట్ ను మళ్లీ బయటకు తీసుకు రావాల్సి వస్తుంది. భార్య మామా జిలాతో కలిసి అతడు రంగంలోకి దిగుతాడు. కానీ ఇది రొటీన్ రెస్క్యూ మిషన్ కాదు. ఎందుకంటే ఏలియన్స్ హైటెక్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు.
నిజం ఏది, సిమ్యులేషన్ ఏది ? అనే తేడా కూడా గుర్తించలేని పరిస్థితులు ఎదురవుతాయి ఆ తండ్రికి. కూతురిని కాపాడే ప్రయత్నంలో పాపా జోలా మళ్లీ తన పాత రహస్య సంస్థతో కలిసి పని చేయాల్సి వస్తుంది. ఒకవైపు కుటుంబాన్ని రక్షించాలి, మరోవైపు ఏలియన్స్ ప్లాన్ ను అడ్డుకోవాలి. ఈ క్రమంలో అతడి గతం ఏంటి అన్నది బయట పడుతుందా ? కుటుంబాన్ని అతను ఎలా కాపాడుకున్నాడు ?, సీక్రెట్ ఏజెంట్ జీవితం చివరికి ఏమైంది ? అన్నదే కథ.
‘పాపా జోలా ది మూవీ’ నిజామ్ రజాక్, నూర్ ఎజ్డియాని, యూసుఫ్ బహ్రిన్ తదితరుల వాయిస్‌లతో రూపొందింది. ఈ సినిమాకి నిజామ్ అబ్ద్ రజాక్ దర్శకత్వం వహించారు. ఇది మలేషియన్ యానిమేషన్, సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. కానీ తెలుగు ఆడియో అవైలబుల్ గా లేదు.
Read Also: కోడి చుట్టూ తిరిగే కథ… చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించడం కష్టం… తెలుగులోనే స్ట్రీమింగ్