OTT Movie : మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు ఇప్పడు బాగా క్రేజ్ పెరిగిపోయింది. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, పోలీసులను ఒక సైకో టార్గెట్ చేస్తుంటాడు. ఈ స్టోరీ చివరి వరకూ రసవత్తరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఆహా (aha) లో
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అంజామ్ పతిరా’ (Anjaam Pathiraa). 2020 లో విడుదలైన ఈ మూవీ మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో కుంచాకో బోబన్, షరఫ్ యూ ధీన్, శ్రీనాథ్ భాసి, ఉన్నిమాయ ప్రసాద్, జిను జోసెఫ్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఇది 2020 లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. ఈ మూవీ సన్ ఎన్ఎక్స్‌టీ (SUN NXT), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (Airtel Xstream), ఆహా (aha) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీకి వెళితే
కొచ్చిలో పోలీసు అధికారులు ఒకరి తర్వాత ఒకరు దారుణంగా హత్యకు గురవుతుంటారు. ప్రతి హత్యలో చనిపోయిన వ్యక్తి గుండె, కళ్ళను పీకేస్తుంటాడు కిల్లర్. ఈ హత్యలు పోలీసు శాఖలో భయాందోళనలను రేకెత్తిస్తాయి. ఎందుకంటే బాధితులంతా పోలీసు అధికారులే కావడంతో, అందరూ ఆలోచనలో పడతారు. మరోవైపు అన్వర్ హుస్సేన్ ఒక కన్సల్టింగ్ సైకాలజిస్ట్ గా ఉంటాడు. పోలీసు అధికారి అయిన అన్వర్ స్నేహితుడు అనిల్ మాధవన్, ఈ కేసులో హంతకున్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. డీసీపీ కేథరిన్ నేతృత్వంలోని పోలీసు బృందంతో కలిసి, అన్వర్ ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. అతను ఒక హ్యాకర్ అయిన ఆండ్రూ సహాయాన్ని కూడా తీసుకుంటాడు.
Read Also : పోలీసులకు చుక్కలు చూపించే సీరియల్ కిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్
అన్వర్ ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్నప్పుడు, హంతకుడు అసాధారణమైన తెలివితేటలతో హత్యలను జరిపినట్లు తెలుస్తుంది. హంతకుడు చంపుతున్న వారిని ఎలా ఎంచుకుంటున్నాడు? వారిని ఎలా మాయం చేస్తున్నాడు? అనే విషయాలు అన్వర్‌ను గందరగోళానికి గురిచేస్తాయి. ఈ హత్యల వెనుక గతంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలు ఉన్నాయని, అందుకే హంతకుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. హంతకుడు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని, వారిని హిప్నోటైజ్ చేసే డ్రగ్‌ను ఉపయోగించి హత్యలు చేస్తుంటాడు. అన్వర్, అతని బృందం హంతకుడిని, కనిపెట్టడానికి అనేక పద్దతులను పాటిస్తారు. కానీ ప్రతి దశలోనూ హంతకుడు వారికంటే ఒక అడుగు ముందుంటాడు. చివరికి ఆ కిల్లర్ ని పోలీసులు పట్టుకుంటారా ? కిల్లర్ ఎందుకు పోలీసులను టార్గెట్ చేస్తున్నాడు ? అతని గతం ఏమిటి ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.