BigTV English
Advertisement

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Paradha OTT: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ చిత్రం పరదా.. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లలోకి వచ్చేసింది. ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఎలాంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.. సడన్ గా ఈ మూవీ రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న సరే మరోవైపు సినిమా పెద్దగా ఆకట్టుకున్నందుకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చేసిందో ఒక్కసారి చూసేద్దాం..


సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన ‘పరదా’..

గతంలో టిల్లు స్క్వేర్ మూవీతో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అనుపమ ఈ ఏడాది పరదా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఒక మెసేజ్ తో ఈ సినిమాని ప్రేక్షకులు కు చూపించాలని డైరెక్టర్ అనుకున్న సరే.. అది కాస్త రివర్స్ అయింది. అనుకున్న దానికన్నా ఎక్కువగానే విమర్శలను అందుకుంది. దాంతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజులకే యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మూవీ సడన్గా ఓటీటీలో ప్రత్యక్షమైంది.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకోగా శుక్రవారం నుంచి సడన్గా స్ట్రీమింగ్ అవుతోంది. ‘సినిమా బండి’, ‘శుభం’ ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా… అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హర్షవర్దన్ కీలక పాత్రలు పోషించారు.

Also Read : రాఘవ లారెన్స్ గొప్ప మనసుకు ఫిదా.. సొంతింటినే పాఠశాలగా…


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

కల్పిత ఊరిలో అనాదిగా వస్తోన్న ఆచారానికి సంబంధించి బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా ‘పరదా’ మూవీని తెరకెక్కించారు. పడతి అనే గ్రామంలో ఆడవాళ్ళందరూ పరాదాన్ని ధరించి తిరగాలని అక్కడ సాంప్రదాయం. ఒకవేళ పొరపాటున పరదా ఎవరైనా తీస్తే ఆ ఊరి గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సిందే. ఇలాంటి టైంలో ఆ ఊరి యువతి సుబ్బు అలియాస్ అనుపమ ఫోటో ఒకటి బయటకు వస్తుంది. తాను ఆచారాలను పాటించానని… ఆ ఫోటో ఎలా బయటకు వచ్చిందో తెలియదని వేడుకున్నా గ్రామస్థులు ఆమె మాట వినరు. పెద్దలంతా కలిసి అమ్మోరి ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సిందే అని తీర్మానం చేస్తారు.. లేదా ఆమె ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని ఆ ఊరి పెద్దలు కండిషన్ పెడతారు. మరి ఆ తప్పు నుంచి ఆమె బయటపడిందా? చివరకు సుబ్బు పరిస్థితి ఏమవుతుంది అన్నది ఈ మూవీ స్టోరీ.. ఆనంద మీడియా బ్యానర్పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ మూవీని నిర్మించారు.. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఈ సినిమా.. కనీసం ఓటీటీలో అయిన హిట్ అవుతుందేమో చూడాలి..

Related News

Dude OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : పెళ్ళైన వాడితో పాల గ్లాసు యవ్వారం… హెబ్బా పటేల్ లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్

OTT Movie : మర్డర్ మిస్టరీ నుంచి సూపర్ హీరో దాకా… ఈ వారం ఒక్కో ఓటీటీలో ఒక్కో జానర్లో మోస్ట్ అవైటెడ్ తమిళ థ్రిల్లర్లు

OTT Movie : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

OTT Movie : ఒంటరి పిల్ల ఒంటిపై చెయ్యేసి పాడు పని… ట్విస్టులతో మతిపోగొట్టే మలయాళ మూవీ

OTT Movie : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Big Stories

×