OTT Movie : మలయాళం సినిమాలను ఇప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, కథలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, అక్రమ సంబంధం కారణంగా ఒక ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందుల్లో పడుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో రమ్యకృష్ట ప్రధాన పాత్రలో మెప్పించింది. ఈ సినిమా పేరు ? ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘అప్పవుమ్ వీంజుమ్’ (Appavum Veenjum) 2015లో విడుదలైన మలయాళం థ్రిల్లర్ సినిమా. దీనికి విశ్వన్ దర్శకత్వం వహించారు. షైన్ ఆగస్టిన్, బెన్నీ ముండాక్కల్, టి.సి. బాబు ఎం.టి.ఎం ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో సన్నీ వేన్, రమ్య కృష్ణ, ప్రతాప్ పోతెన్, రేష్మ రాథోర్, బాలు వర్గీస్, శ్వేతా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది కేరళలోని మున్నార్, వాగమన్, కుట్టికానం వంటి సుందరమైన హైరేంజ్ లొకేషన్స్‌లో చిత్రీకరించబడిన ఈ సినిమా. ఈ సినిమా 2015 ఫిబ్రవరి 13, థియేటర్లలో విడుదలైంది. IMDbలో 6.2/10 రేటింగ్‌తో, సన్నీ వేన్, రమ్య కృష్ణన్, ప్రతాప్ పోతెన్ నటన, సినిమాటోగ్రఫీకి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ప్రస్తుతం Jio Hotstar, Manorama Maxలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
జూడ్ గోవాలోని ఒక చిన్న మ్యూజిక్ బ్యాండ్‌లో గిటారిస్ట్‌గా పనిచేస్తూ, సంగీతంలో పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. అతను తన బ్యాండ్‌తో కలిసి కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్‌లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తాడు. అక్కడ ఒక బార్‌లో అతను ఫెర్నాండెస్ (ప్రతాప్ పోతెన్) అనే విచిత్రమైన ఎస్టేట్ యజమానిని కలుస్తాడు. ఫెర్నాండెస్ సంగీత ప్రేమికుడు. మద్యపానంతో సమయాన్ని గడిపే వ్యక్తి. కొన్ని డ్రింక్స్ తర్వాత వీరిద్దరూ స్నేహితులవుతారు. ఫెర్నాండెస్ జూడ్‌ను తన విలాసవంతమైన బంగళాకు ఆహ్వానిస్తాడు.ఫెర్నాండెస్ భార్య మెర్లిన్ (రమ్య కృష్ణ) ఒక అందమైన మహిళ. ఆమె ఒంటరితనంతో బాధపడుతూ, తన భర్తతో విడిగా జీవితాన్ని గడుపుతోంది. 16 సంవత్సరాల క్రితం మెర్లిన్ ఫెర్నాండెస్ స్నేహితుడితో అఫైర్ కలిగి ఉండటం వల్ల, వీరి వివాహం విచ్ఛిన్నమై, ఒకే ఇంట్లో వేర్వేరుగా జీవిస్తుంటారు. ఇప్పుడు జూడ్ ఫెర్నాండెస్ కుటుంబంలో భాగమవుతాడు. మెర్లిన్‌తో అతని సంబంధం రొమాంటిక్ గా మారుతుంది.
Read Also : భార్య ఉండగానే మరొక అమ్మాయితో… ట్విస్టుల మీద ట్విస్టులు… ఇది తెలుగు వెబ్ సిరీసే