OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇవి భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయి కడుపులో ఒక వింత జీవి పెరుగుతుంది. ఈ స్టోరీ కాస్త భిన్నంగా ఉంటుంది. చివరివరకూ సస్పెన్స్ తో మెంటలెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
డిస్నీ + హాట్ స్టార్ (Disney + Hot Star) లో
ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అప్పెండేజ్’ (Appendage). 2023 లో విడుదలైన ఎ మూవీకి అన్నా జ్లోకోవిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హన్నా అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో హాడ్లీ రాబిన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ 2022 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది జ్లోకోవిక్ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా రూపొందించబడింది. డిస్నీ + హాట్ స్టార్ (Disney + Hot Star) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
హన్నా అనే అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ గా జాబ్ చేస్తుంటుంది. హన్నాపైకి సంతోషం గా ఉన్నప్పటికీ, తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉంటుంది. ఆమె వృత్తిలో తన ప్రతిభపై కూడా సందేహం గా ఉంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ కైలిన్, బెస్ట్ ఫ్రెండ్ ఎస్తర్ తో సంబంధాలలో సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల నుండి ప్రేమ లేకపోవడం వంటివి ఆమెను బాగా కుంగదీస్తాయి. ఈ మానసిక ఒత్తిడి వల్ల, ఆమె శరీరంలో ఒక విచిత్రమైన పెరుగుదలగా రూపాంతరం చెందుతుంది. ఈ పరానాయిడ్ జీవి ఆమె శరీరంలోని ఎలా వచ్చిందో అర్థం కాక హన్నా భయపడుతుంది. డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది. ఇది ఆమె గర్భంలో వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ వల్ల సంభవించిందని ఒక వైద్యుడు చెబుతాడు. దీనినే అప్పెండేజ్ గా పిలుస్తారని తెలుసుకుంటుంది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యం మరింత బలహీనం అవుతుంది.
హన్నా తన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతుకుటుంది. తనలాంటి సమస్యలు ఉన్నవారి కోసం ఒక సపోర్ట్ గ్రూప్‌ను కనుగొంటుంది. అక్కడ ఆమె క్లాడియా అనే స్త్రీని కలుస్తుంది. ఆమె హన్నాకు సలహాలు ఇస్తుంది. సపోర్ట్ గ్రూప్ సభ్యులు తమ అప్పెండేజ్‌లను సెడేట్ చేసి నియంత్రించమని సూచిస్తారు. కానీ హన్నా తన అప్పెండేజ్‌తో మాట్లాడటం, ప్రేమ పెంచుకోవడం చేస్తుంది. ఈ జీవి ఆమె వీక్ నెస్ ను ఉపయోగించి బలం పొందుతూ, చివరికి ఆమె జీవితాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ జీవి మంచిది కాదని తెలుసుకున్నాక, హన్నా తన అప్పెండేజ్‌తో పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆమె తన స్నేహితులు, కుటుంబంతో సంబంధాలను సరిదిద్దుకుంటుంది. చివరికి ఆ వింత జీవినుంచి హన్నా బయటపడుతుందా ? అనేది తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతుర్నే వాడుకునే ఓ కసాయి తండ్రి … చివరికి ఆ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్