Viral video: ఇప్పుడు ఎక్కడ చూసిన సోషల్ మీడియా హవానే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచం నలుమూలలా ఎక్కడేం జరిగినా ఇట్టే క్షణాల్లో తెలిసిపోతుందంటే సోషల్ మీడియానే కారణం.. జంతువులకు సంబంధించిన వీడియోలు, కామెడీ వీడియోలు ఇలా చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా.. బెంగళూరులో ఒక సాధారణ బస్సు ప్రయాణం అనూహ్యంగా గందరగోళంగా మారిన వీడియో సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతోంది.. ఒక బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు డ్రైవర్, ఒక మహిళా ప్రయాణికురాలి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రమై, ఇద్దరూ ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకునే స్థాయికి చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
#Viral: A heated argument between a BMTC bus driver and a woman turned physical as both slapped each other in #Bengaluru, an incident caught on video and widely shared online.
Passengers attempted to intervene but failed to stop the clash. Following the viral video, Bengaluru… pic.twitter.com/NaBMEUGXoZ
— India Today NE (@IndiaTodayNE) September 11, 2025
ఒక బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో డ్రైవర్, ఒక మహిళా ప్రయాణికురాలి ఏదో చిన్న వాగ్వాదం జరిగింది. కాసేపు ఇద్దరు మాటా మాట అనుకున్నారు. ఈ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రమై గొడవకు దిగారు. ఈ గొడవ ఎక్కడికి చేరిందంటే.. ఇద్దరూ ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనను ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వాగ్వాదం తీవ్రమవుతూ, ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునే దృశ్యాలు కనిపిస్తాయి. కొందరు ప్రయాణికులు ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు గొడవను మాత్రం ఆపలేదు.
ALSO READ: Kurnool News: కిరాతక తండ్రి.. 8 నెలల పసిపాపను డ్రమ్ములో ముంచి.. భార్యను దారుణంగా కొట్టి..!
ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు సిటీ పోలీసులు స్పందించారు. వారు ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పంపించి, తదుపరి చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదకి ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే, ఈ గొడవకు ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. కొందరు నెటిజన్లు మహిళా ప్రయాణికురాలిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారి వాదన ప్రకారం.. ఆమె మొదట అసభ్యంగా ప్రవర్తించి, ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకుంది. మరికొందరు మాత్రం డ్రైవర్ ప్రవర్తనను తప్పుపట్టారు.. అతని వ్యవహార శైలిని విమర్శించారు.
ALSO READ: Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్
ఈ ఘటన బెంగళూరు లాంటి పెద్ద నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులు, ఉద్యోగుల మధ్య సంబంధాలు ఎంత సున్నితంగా ఉంటాయో సూచిస్తుంది. చిన్న విషయాలు కూడా త్వరగా తీవ్రమైన ఘర్షణలకు దారితీయవచ్చు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు, ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మిగిలిపోతుంది. ఈ ఘటన మనకు సహనం, సంయమనం, పరస్పర గౌరవం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేసే వారు ప్రయాణికులు ఇలాంటి సంఘటనలను నివారించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.