OTT Movie : ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు చిన్నపిల్లల నుంచి, పెద్దల వరకు చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సినిమాలలో విజువల్స్ కూడా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్వప్న కళల చుట్టూ తిరుగుతుంది. ఈ కలలు ఒక పురాతనమైన పుస్తకం వల్ల సంభవిస్తుంటాయి. వీటివల్ల వేరే మనుషుల కలలోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ ఫాంటసీ మూవీ ఓటిటిలో అదరగొడుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) లో
ఈ ఫాంటసీ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘సిల్వర్ అండ్ ది బుక్ ఆఫ్ డ్రీమ్స్’ (Silver and the Book of Dreams). ఈ మూవీ కెర్స్టిన్ గియర్ రాసిన ‘ది సిల్వర్ ట్రిలాజీ’ నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ ఫాంటసీ మూవీ లూసిడ్ డ్రీమింగ్ అనే స్వప్న కలల చుట్టూ తిరుగుతుంది. దీనికి హెలెనా హఫ్‌నాగెల్ దర్శకత్వం వహించారు. ఇది 2023 డిసెంబర్ 8 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) లో అందుబాటులోకి వచ్చింద.
స్టోరీలోకి వెళితే
లివ్ అనే 17 ఏళ్ల అమ్మాయి, తన తల్లి ఆన్, చెల్లెలు మియాతో కలిసి జర్మనీ నుంచి లండన్‌కు మారుతుంది. వారి తండ్రి మరణం తర్వాత, ఆన్ ఎర్నెస్ట్ అనే కొత్త వ్యక్తి తో జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఎర్నెస్ట్‌కు ఇద్దరు పిల్లలు ఉంటారు. లివ్ తన తండ్రి మరణం వల్ల చాలా డిప్రెషన్ కి వెళ్తుంది. ఈ సమయంలో లండన్‌లో లివ్ కు నలుగురు అబ్బాయిలతో పరిచయం ఏర్పడుతుంది. వీరు ‘బుక్ ఆఫ్ డ్రీమ్స్’ అనే పుస్తకం ద్వారా తమకు నచ్చిన కలల లోకి ప్రవేసిస్తుంటారు. ఈ పుస్తకం వారి కలలను నియంత్రించడానికి, ఇతరుల కలల్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఈ సమూహం లివ్‌ను తమ కలల ప్రపంచంలో చేరమని ఆహ్వానిస్తారు. తమకు నచ్చిన విధంగా, ఇది వారి కలలను నిజం చేస్తుందని నమ్ముతారు.
ఈ డ్రీమింగ్ లో లివ్ ఒక ఆకుపచ్చ తలుపు ద్వారా కలల ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఆమె హైగేట్ సిమెటరీలో అబ్బాయిలు రిచ్యువల్ చేస్తుంటారు. ఈ రిచ్యువల్ బుక్ ఆఫ్ డ్రీమ్స్‌ను ఉపయోగించి జరుగుతుంది. ఈ క్రమంలోనే చనిపోయిన తన తండ్రితో కూడా మాట్లాడగలుగుతుంది. ఈ పుస్తకం అనాబెల్ స్కాట్ అనే అమ్మాయి కుటుంబానికి చెందినది అని తెలుస్తుంది. ఈ రిచ్యువల్ విజయవంతమై, వారి కలలు నిజమవుతాయి. కానీ ఊహించని రీతిలో వారి పీడకలలు కూడా వాస్తవంగా మారతాయి. అనాబెల్ స్నేహితురాలు ఈ కలల ప్రపంచంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. లివ్ ఆమె గురించి తెలుసుకుని తన ఉద్దేశాలు హానికరమైనవి గ్రహిస్తుంది. ఆమె బుక్ ఆఫ్ డ్రీమ్స్ కి సంబంధించిన రహస్యాలను దాచిపెట్టిందని గ్రహిస్తుంది. చివరికి బుక్ ఆఫ్ డ్రీమ్స్ వల్ల లివ్ ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? దానిలో దాగి ఉన్న రహస్యం బయట పడుతుందా ? ఈ విషయాలను, ఈ ఫాంటసీ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : క్రూరంగా కోరికలు తీర్చుకునే భర్త … రాత్రయితే వణికి పోయే భార్య