OTT Movie : హారర్ ఎలిమెంట్స్ తో వస్తున్న వెబ్ సిరీస్ లు ఎక్కువ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. మొదటగా ఈ జనర్ ని చూడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఓటీటీలో ఇలాంటి సిరీస్ లు చాలానే ఉన్నాయి. అయితే ఒక మరాఠీ హారర్ మిస్టరీ సిరీస్ డిఫరెంట్ స్టోరీతో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సిరీస్ మరాఠీలో మొదటి పీరియడికల్ హారర్ డ్రామాగా నిలిచింది. ఒక శాపం చుట్టూ తిరిగే ఈ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సర్దేశ్ముఖ్ వాడా అనే ప్రదేశం ఒక శాపంతో ఉంటుంది. ఈ శాపం కారణంగా, ఒక మహిళ ఆత్మ ఇంట్లోని పురుషులకు మాత్రమే కనిపిస్తుంది. ఆమె హత్యలు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటుంది. మహిళలు ఈ ఇంట్లోకి ప్రవేశం చేయకూడదని నిషేధం ఉంది. కథ రెండు టైమ్‌లైన్‌లలో తిరుగుతుంది. 1930లలో లక్ష్మి పాత్ర, 1960లలో సుషీలా పాత్ర. ఈ శాపం వల్ల ఒక ఆత్మ కష్టాలతో బాధపడుతుంటుంది. ఈ శాపాన్ని బ్రేక్ చేయడానికి మాత్రమే ఆ కష్టాలను అనుభవించాలి. ఇక ఈ కథ 1960లలో మొదలవుతుంది. ఇక్కడ రావ్ అనే యువకున్ని రావణ్ అని కూడా పిలుస్తారు. అతను డీమన్స్ తో పోరాడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ శాపం కారణంగా, ఆ మహిళ ఆత్మ ఇంట్లోని పురుషులను టార్గెట్ చేస్తుంటుంది.
కానీ సుషీలా అనే క్యూరియస్ యువతి ఇక్కడికి చేరుకుంటుంది. ఆమె రావ్‌తో కలిసి శాపం రహస్యాలను కనుగొనడం మొదలు పెడుతుంది. 1930ల ఫ్లాష్‌బ్యాక్ ఇప్పుడు మొదలవుతుంది. లక్ష్మి పాత్ర ద్వారా శాపం మూలాలు వెల్లడవుతాయి. సుషీలా ఇంటికి వచ్చిన తర్వాత, రావ్ తో ఒక బాండ్ ఏర్పడుతుంది. ఆమె అతని భయాలను హీల్ చేయడానికి సహాయపడుతుంది. సుశీలా ధైర్యంగా అక్కడి రహస్యాలను వెలికితీస్తుంది. క్లైమాక్స్‌లో ఈ సిరీస్ ఎమోషనల్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఈ శాపం ఏమిటి ? ఎందుకు వచ్చింది ? లక్ష్మి ఎలా ఆత్మగా మారింది ?సుశీలా, రావ్ ఈ శాపాన్ని ఎలా ఎదుర్కుంటారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
‘అథంగ్’ (Athang) 2022లో విడుదలైన మరాఠీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. జయాంత్ పవార్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ధైర్య ఘోలప్ (రావు/రావణ్), భాగ్యశ్రీ మిలింద్ (సుశీలా), నివేదితా సరాఫ్ (ఆఉ/లక్ష్మి), సందీప్ ఖారే (సార్దేశ్ముఖ్), ఉర్మిళా కోథారే (సపోర్టింగ్ రోల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 6 ఎపిసోడ్‌లతో IMDbలో 8.8/10 రేటింగ్ పొందింది. ఈ సిరీస్ ప్లానెట్ మరాఠీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 2022 నవంబర్ 25న విడుదలైంది. ఇది తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది.
Read Also : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో భర్త… ఇంకొకడితో భార్య జంప్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే