OTT Movie : ట్యాలెంట్ ఉంది కదాని కాలేజ్ లో సీట్ ఇస్తే ఆమె చేయకూడని పనులు చేసి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రేజీ పిల్ల చేసే పని మిస్ కాకుండా చూడాల్సిందే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ హీస్ట్ థ్రిల్లర్ మూవీ పేరు’బ్యాడ్ జీనియస్'(Bad Genius). 2024లో వచ్చిన ఈ సినిమాకి J.C. లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఒక ట్యాలెంటెడ్ విద్యార్థి అయిన లిన్ కాంగ్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక ఎలైట్ ప్రైవేట్ స్కూల్‌లో స్కాలర్ షిప్‌పై చదువుతూ ఉంటుంది. డబ్బు కోసం చేయకూడని పని చేయడం మొదలు పెడుతుంది. మిగతా పాత్రల్లో బెనెడిక్ట్ వాంగ్, కాలినా లియాంగ్, జబారి బ్యాంక్స్, టేలర్ హిక్సన్, సారా-జేన్ రెడ్‌మండ్ నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
లిన్ కి మ్యాథ్స్ లో మంచి ట్యాలెంట్ ఉంటుంది. ఆ ప్రతిభను చూసి స్కూల్ యాజమాన్యం ఆమెకు సీటు ఇస్తారు. అయితే ఆమె ఒక రోజు తన స్నేహితురాలు గ్రేస్ కు పరీక్షలో సమాధానాలు చెప్పి హెల్ప్ చేస్తుంది. గ్రేస్ బాయ్ ఫ్రెండ్ పాట్ ఒక ధనిక న్యాయవాది కొడుకు. అతను లిన్ చేసిన పనికి మెచ్చుకుని ఆమె ముందుకు ఒక ప్రతిపాదన తీసుకొస్తాడు. ఆమె ప్రతిభను ఒక వ్యాపార అవకాశంగా మార్చాలని చూస్తాడు. పరీక్షల్లో కాపీ కొట్టించి డబ్బులు సంపాదించాలని ఆమెకు ఆశలు పుట్టిస్తాడు. ఇక లిన్ కి కూడా ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకపోవడంతో ఈ పనికి ఒప్పుకుంటుంది. తన పియానో నైపుణ్యాలను ఉపయోగించి, పరీక్ష సమాధానాలను సీక్రెట్ కోడ్‌గా ప్లే చేసే ఒక తెలివైన విధానాన్ని రూపొందిస్తుంది.
Read Also : ఈ పేదమ్మాయి టాలెంట్ కి వణికిపోయిన ధనవంతులు … ఫ్యూజులు అవుట్ అయ్యే షో చూపించిందిగా
ఈ ప్లాన్ సక్సెస్ కావడంతో, ఆమె తన సహవిద్యార్థుల నుండి డబ్బు సంపాదించడం ప్రారంభిస్తుంది. పాట్ తండ్రి లిన్ ను సంప్రదించి, పాట్ కు SATలో మంచి స్కోర్ సాధించడంలో సహాయం చేస్తే, న్యూయార్క్ లో ఒక అపార్ట్‌మెంట్ ను ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ఈ ప్రతిపాదన లిన్ ను మరింత పెద్ద స్కామ్ లోకి లాగుతుంది. ఆమె మరో నైజీరియన్ స్కాలర్ షిప్ విద్యార్థి బ్యాంక్ తో కలిసి SAT పరీక్ష సమాధానాలను దొంగిలించే ప్లాన్ ను చేస్తారు. ఈ ప్లాన్ చాలా రిస్క్ తో కూడుకున్నది. అయినా కూడా వీళ్ళు దీన్ని తేలిగ్గా చేయగలుగుతారు. ఈ క్రమంలో ఆమె డబ్బులు కూడా బాగానే సంపాదిస్తుంది. ఒకరోజు ఈ పరిక్షలో ఇద్దరు విద్యార్థులు దొరికిపోతారు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి లిన్ ఈ స్కామ్ లో చిక్కుకుంటుందా ? తన తప్పును తెలుసుకుంటుందా ? ఆమె లైఫ్ ఎలా టర్న్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.