Rohit Sharma : ముంబై ఇండియన్స్ క్రికెటర్ రోహిత్ శర్మ కీలక ఆటగాడిగా ముంబై కి ఆడిన విషయం తెలిసిందే. అయితే ముంబై జట్టు కి కెప్టెన్ గా 5 టైటిళ్లను అందించాడు రోహిత్ శర్మ. ఇక గత ఏడాది ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా ని కెప్టెన్ గా ఎంచుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చెందింది. ఆ ఓటమి తరువాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరితో ప్రత్యేకంగా మీట్ అయ్యారు. ప్రతీ ఒక్కరూ ముంబై ఇండియన్స్ టీమ్ కి సపోర్టు చేశారని స్టాప్ ని కూడా అభినందించారు రోహిత్ శర్మ. ఇక ఈ సందర్భంలో ముంబై ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కి రోహిత్ శర్మ వంగి మరీ దండం పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read : IPL 2025 Final: భారీ వర్షం.. ఫైనల్ మ్యాచ్ కు బ్రేక్.. రద్దు అయితే విజేత ఎవరు
ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడితే.. వాటిలో 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ప్లే ఆప్స్ రేస్ లో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడించింది. దీంతో గుజరాత్ ఇంటిముఖం పట్టింది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై జట్టు ఓటమి పాలైంది. దీంతో రాబోయే సీజన్ కి ఎలా ప్రిపేర్ కి అవ్వాలి..? ఏవిధంగా వ్యవహరించాలి అని కొన్ని సూచనలు చేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫైనల్ కి చేరుకుంటుందని.. ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ ని ఓడించి రికార్డు సృస్టిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు.. ముంబై అభిమానుల ఆశలను నెరవేర్చకుండా చేసింది.
అలాగే ఆర్సీబీ అభిమానుల ఆశలపై కూడా నీరు చల్లుతుందని పంజాబ్ కింగ్స్ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందంటే.. ఇదేనేమో.. అలా రెచ్చిపోతున్నారు శ్రేయాస్ అయ్యర్. 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అయినా శ్రేయస్ అయ్యర్ నిరాశ చెందలేదు. కెప్టెన్ గా రంజీ ట్రోఫీ, SMAT, IPL, ఇరానీ ట్రోఫీలు గెలిచారు. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. తిరిగి కాంట్రాక్ట్ ను దక్కించుకున్నారు. ఇప్పటి వరకు కప్పు నెగ్గని పంజాబ్ కింగ్స్ ని ఈ సారి ఫైనల్ కి చేర్చారు. అన్ని కలిసి వస్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు టైటిల్ గెలుస్తుందనే ధీమాతో ఉన్నారు అభిమానులు. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.
The way Rohit Sharma is meeting everyone from Mumbai Indians players to the smallest support staff before going home.🥹💙
The most humble and down-to-earth man @ImRo45 🐐 pic.twitter.com/3cGUAbQoyY
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 2, 2025