PBKS VS RCB FINAL : ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ని ఓడించిన పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఇవాళ మంచి ఊపులో కొనసాగుతోంది. టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ పాటిదార్.. మనస్సులో మ్యాచ్ గెలిచే ఆలోచనలో ఉన్నట్టు అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : Musheer Khan : విరాట్ కోహ్లీ పరువు తీసిన ముషీర్ ఖాన్… మిమ్మల్ని టైటిల్ గెలవనివ్వమంటూ సిగ్నల్స్
లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి స్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ జట్టు రెండో స్థానంలో కొనసాగింది. అయితే క్వాలిఫయర్ 1లో మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టు 101 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కేవలం 10 ఓవర్లలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛేదించింది. ఆ తరువాత క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ జట్టు విజయం సాధించింది. దీంతో మళ్లీ పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్ రేస్ లోకి వచ్చింది. క్వాలిఫయర్ 1లో ఎలాగో ఓడిపోయామని.. ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ ని ఓడిస్తామనే ధీమాలో ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. మరోవైపు మొన్న ముంబై ఇండియన్స్ ని ఓడించినట్టుగానే నేడు రాయల్ ఛాలెంజర్స్ ని ఓడిస్తామని ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పేర్కొంటున్నారు. మరోవైపు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం విశేషం. అభిమానులు ఎంత రేట్ పెట్టినా టికెట్ కొనుగోలు చేసి ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు.
Also Read : RCB – Evil Eye : టైటిల్ గెలవాలని RCB ఫ్యాన్ ప్లానింగ్… కారు మొత్తం నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి మరీ
దాదాపు లక్ష మందికి పైగా ఈ మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఎలాగైనా కప్ గెలిచి తమ అభిమానుల కోరికను నెరవేర్చాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసేందుకుకు ఉద్యోగుల డిమాండ్ మేరకు బెంగళూరులోని కొన్ని ఐటీ, వివిధ సంస్థలు ఉద్యోగులకు సెలవులు కూడా ప్రకటించేశాయి. మరోవైపు కొన్ని MNC లలో లైవ్ స్ట్రీమింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఈ మ్యాచ్ తొలి బంతినే అర్ష్ దీప్ సింగ్ వైడ్ వేయడం విశేషం. దీంతో ఆర్సీబీ కి తొలి బంతి బ్యాటర్ కొట్టకుండానే స్కోర్ బోర్డు ప్రారంభమైంది. మరోవైపు ఓపెనర్ సాల్ట్ సిక్స్ తో ప్రారంభించాడు. ఈ బెంగళూరు ఎన్ని పరుగులు చేస్తుందో వేచి చూడాలి మరీ.
PBKS :
ప్రియాంశ్, ఇంగ్లీస్, శ్రేయాస్ అయ్యర్, వధేరా, శశాంక్, స్టోయినీస్, ఒమర్జాయ్, జెమిసన్, వైశాక్, అర్ష్ దీప్, చాహల్.
RCB :
విరాట్ కోహ్లీ, సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హేజిల్ వుడ్.