OTT Movie : చిన్నప్పుడు చిన్నపిల్లలు తినకపోతే, తల్లిదండ్రులు బూచోడు వస్తాడు అని చెప్పి భయపెడుతుంటారు. ఒకరకంగా దయ్యాలు ఉంటాయని చెప్పి తల్లిదండ్రులే మొదటగా భయపెడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇటువంటి ఇమేజినేషన్ లోనే సాగుతుంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ ఏఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్యాగ్ మ్యాన్‘ (Bagman). ఈ మూవీలో ఒక విచిత్రమైన ఆకారం, బ్యాగులో పిల్లల్ని ఎత్తుకెళ్తూ ఉంటుంది. ఈ బ్యాగ్ మ్యాన్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కంటికి కనిపించని ఒక అదృశ్య ఆకారం చిన్నపిల్లల్ని బ్యాగులో మడతపెట్టి తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే ఈ స్టోరీ హీరో ఇంట్లో కూడా జరుగుతుంది. మన కథలో హీరోకి భార్య కరీనా, కొడుకు జాక్ ఉంటారు. జాక్ చిన్న పిల్లోడు కావడంతో ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక ఆకారం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని కొత్త బొమ్మలు కూడా ఆ ప్రాంతంలో కనపడతాయి. డౌట్ వచ్చిన హీరో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే ఇక్కడ ఎవరూ లేరని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. ఇలా కంటిన్యూ గా జరుగుతుండడంతో, తనకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని కరీనా, భర్తని సైకాలజిస్ట్ కు చూపిస్తుంది. ఆమె కూడా నువ్వు ఊహించుకోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తుంది. హీరో చాలా అది విని బాధపడతాడు. చిన్న వయసులో హీరో ఒక పెద్ద బండరాయి దగ్గర ఒక రూపం చూస్తాడు. అప్పటినుంచి అక్కడికి వెళ్లాలంటే భయపడుతుంటాడు. తండ్రి కూడా ఆ చోటికి వెళ్లొద్దని చెప్తూ ఉండటంతో, హీరోకి భయం స్టార్ట్ అవుతుంది.
హీరో తండ్రి కూడా తనకి ఒక కత్తి ఇచ్చి భద్రంగా ఉంచుకోమని చెప్తాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ మ్యాన్ వస్తే ఇది ఉపయోగపడుతుందని అంటాడు. హీరో మాత్రం ఆ తరువాత పెద్దగా అయిపోతాడు. హీరో కొడుకు కి ఫ్లూట్ బొమ్మని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు జాక్ ని బ్యాగ్ మ్యాన్, బ్యాగులో తీసుకుని వెళ్ళిపోతాడు. హీరో కూడా వెంటనే అతన్ని ఫాలో అవుతాడు. అయితే ఆ బండరాయి దగ్గరికి వచ్చిన బ్యాగ్ మ్యాన్ తర్వాత కనపడకుండా పోతాడు. హీరో దాని లోపలికి వెళ్లి జాక్ కోసం వెతుకుతాడు. అయితే అందులో క్యాండిల్స్ చాలా వెలుగుతూ ఉంటాయి. ఆ క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయో, అంతమంది చిన్న పిల్లల్ని ఆ బ్యాగ్ మాన్ చంపేసి ఉంటాడు. చివరికి హీరో తన కొడుకును కాపాడుకుంటాడా? బ్యాగ్ మ్యాన్ చేతిలో బలవుతాడా? ఇంతకీ ఆ బ్యాగ్ మ్యాన్ నిజంగా ఉన్నాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ ‘బ్యాగ్ మ్యాన్’ (Bagman) మూవీని మిస్ కాకుండా చూడండి.