E-Paper
Advertisement

Balloon on OTT : చచ్చిన మామ కడుపున పుడతాడంటూ భార్యను కష్టపెట్టే భర్త… ఈ మూవీ చిన్నపిల్లలకు మాత్రం కాదు

Balloon on OTT : చచ్చిన మామ కడుపున పుడతాడంటూ భార్యను కష్టపెట్టే భర్త… ఈ మూవీ చిన్నపిల్లలకు మాత్రం కాదు
Advertisement

Balloon on OTT : గ్రామీణ కుటుంబం చుట్టూ తిరిగే స్టోరీలు ఆహ్లాదకరంగా అనిపిస్తుంటాయి. ఆసక్తికరంగా సాగే ఈ సినిమాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ ఒక చైనా ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ మధ్య ఓ గ్రామీణ కుటుంబం ఎలాంటి సమస్యలు ఫేస్ చేసిందో చూపిస్తుంది. ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందింది. ఈ సినిమా పేరు ఏమిటి ? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2019లో వచ్చిన ఈ చైనీస్ (టిబెటన్) సినిమా పేరు ‘బలూన్’ (Balloon). ఇది ప్రముఖ టిబెటన్ దర్శకుడు పెమా సెడెన్ దర్శకత్వంలో రూపొందింది. MUBI, Plex, Prime Videoలో ఈ మూవీ మాండరిన్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో గుర్తింపు పొందింది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019లో హారిజాన్స్ సెక్షన్‌లో ప్రీమియర్. టోక్యో ఫిల్మెక్స్‌లో గ్రాండ్ ప్రైజ్ గెలిచింది. ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్‌ప్లే నామినేషన్. షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డ్. రాటెన్ టమాటోస్‌లో హై పాజిటివ్ రివ్యూలు (క్రిటిక్స్ ప్రశంసలు). పెమా సెడెన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.

Advertisement

Read Also :  గ్రహాంతర అంతరిక్ష నౌక శిథిలాల వల్ల మిస్టీరియస్ జబ్బులు… మైండ్ బెండింగ్ సై-ఫై థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

డార్జే, ఆమె భార్య డ్రోల్కార్ టిబెటన్ పీఠభూమిలో గొర్రెలు పెంచుతూ జీవిస్తుంటారు. వీళ్ళకు ముగ్గురు పిల్లలు కూడా ఉంటారు. అయితే చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న టూ-చైల్డ్ పాలసీ వల్ల వాళ్లు ఇంకా పిల్లలు కనకూడదు. కానీ కాండమ్‌లు వాడుతున్నా కూడా డ్రోల్కార్ మళ్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లలు ఆ కాండమ్‌లను బలూన్‌లుగా ఊది ఆడుకోవడం వల్ల కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో డాక్టర్ అబార్షన్ సజెస్ట్ చేస్తాడు. కానీ డార్జే సోదరి (నన్), తమ తాతగారి ఆత్మ ఈ బిడ్డలో రీఇన్‌కార్నేట్ అవుతుందని తెలుసుకుంటుంది. ఇది మత విశ్వాసాలు, ప్రభుత్వ నియమాల మధ్య భారీ సంఘర్షణకు దారితీస్తుంది. డ్రోల్కార్, డార్జే మత విశ్వాసాలకు లొంగి బిడ్డను కాపాడాలని అనుకుంటాడు. కానీ రియాలిటీ (జరిమానాలు, స్టెరిలైజేషన్ బెదిరింపులు) ఒత్తిడి పెంచుతుంది. ఫైనల్‌గా డ్రోల్కార్ ఫ్యామిలీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి ? డ్రోల్కార్ బిడ్డకి జన్మనిస్తుందా ? అబార్షన్ చేసుకుంటుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

Big Stories

Advertisement
×