E-Paper
Advertisement

OTT Movie : భార్య ఉండగా పని మనిషితో రాసలీలలు… గూస్ బంప్స్ తెప్పించే బెంగాలీ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : భార్య ఉండగా పని మనిషితో రాసలీలలు… గూస్ బంప్స్ తెప్పించే బెంగాలీ హర్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఒక అదిరిపోయే అంథాలజీ హారర్ వెబ్ సిరీస్ ను చూడాలనుకుంటున్నారా ? అయితే ‘బాంగ్లార్ సేరా భూతేర్ గోల్పో’ అనే బెంగాలీ హారర్ సిరీస్ ని చూసేయండి. రెండు సీజన్లు, 12 ఎపిసోడ్స్ తో ఒక్కో ఎపిసోడ్ లో ఒక కొత్త స్టోరీని పరిచయం చేస్తుంది. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే చివరివరకు కదలడం కష్టమే. అంతలా ఇంటెన్సివ్ గా ఈ స్టోరీలు ఉంటాయి. హారర్ స్టోరీలను ఇష్టపడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘బాంగ్లార్ సేరా భూతేర్ గోల్పో’ (Banglar Shera Bhuter Golpo) 2023-2024లో రిలీజ్ అయిన బెంగాలీ అంథాలజీ హారర్ వెబ్ సిరీస్. సీజన్ 1 కి అభిరూప్ ఘోష్, సీజన్ 2కి సుమంత్ బ్యానర్జీ, అభిరూప్ డోలై, సర్వజిత్ చట్టోపాధ్యాయ్ దర్శకత్వం వహించారు. సీజన్ 1 – 6 ఎపిసోడ్‌లు, సీజన్ 2 – 6 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ ఐయండిబిలో 7.8/10 రేటింగ్ పొందింది. సీజన్ 1లో షైబాలీ తలుక్దార్, రిద్ధి జకారియా, సౌమ్య బ్యానర్జీ, సైయద్ అహ్మద్ ప్రధాన పాత్రల్లో నటించగా, సీజన్ 2 లో విబ్రితీ చట్టోపాధ్యాయ్, సౌరభ్ చక్రవర్తీ, రూపసీ శర్మా మోదల్ నటించారు. ఈ సిరీస్ Aaro Ananda ఓటీటీలో బెంగాలీ ఒరిజినల్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ సిరీస్ మొదలవ్వగానే మొదటి ఎపిసోడ్ లో సౌమ్య బెనర్జీ అనే యువకుడు తన పాత బంగ్లా ఇంట్లోకి వచ్చి సెటిల్ అవుతాడు. రాత్రి ఒక ఆత్మ అతని వెనకే తిరుగుతుంది. ఆ సమయంలో అతని గతంలో జరిగిన ఒక మర్డర్ సీక్రెట్ బయటపెడుతుంది. రెండో ఎపిసోడ్ “పేట్నీ”లో రిద్ధి అనే అమ్మాయి తన అమ్మమ్మ ఇచ్చిన పాత సారీ ధరిస్తుంది. ఆ సారీలో ఒక భూతం ఉంటుంది. ఆ భూతం రిద్ధి బాయ్‌ఫ్రెండ్‌ని హాన్ట్ చేసి, పాత రివెంజ్ తీర్చుకుంటుంది. మూడో ఎపిసోడ్ లో షైబాలీ అనే ఒక రచయిత్రి రాసిన నవలలోని క్యారెక్టర్స్ లైఫ్‌లోకి రియల్ గా వచ్చి ఆమెను టార్చర్ చేస్తాయి. నాలుగో ఎపిసోడ్‌లో ఒక ఫ్యామిలీ శంఖం ధరించిన ఒక భూతాన్ని ఎదుర్కొంటుంది. ఆ భూతం ఫ్యామిలీలో ఒకరిని పాసెస్ చేసి, పాత రివెంజ్ తీర్చుకుంటుంది. ఐదో, ఆరో ఎపిసోడ్‌లు కూడా ఫ్యామిలీ కర్సెస్, డెమాన్ పాసెషన్ మీదనే ఉంటాయి.

Read Also :  చీకటి పడితే భర్త టార్చర్… ఆ భార్య చేసిన పనికి ఫ్యూజులు అవుట్ మావా

Advertisement

సీజన్ 2 మరింత భయంకరంగా ఉంటుంది. మొదటి ఎపిసోడ్ విబ్రితీ అనే మహిళకి, ఆమె ఇంట్లో ఒక బ్లాక్ షాడో రోజూ రాత్రి వచ్చి ఆమె డ్రీమ్స్‌లోకి ఎంటర్ అవుతుంటుంది. ఇది ఒక బ్లాక్ మ్యాజిక్‌తో రివెంజ్ థీమ్ తో నడుస్తుంది. రెండో ఎపిసోడ్ లో సౌరభ్ అనే వ్యక్తి ఒక హాన్టెడ్ మాన్షన్ ను కొనుగోలు చేస్తాడు. అందులో మూడు ఆత్మలు ఉంటాయి. అవి ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టి, సౌరభ్ భార్యను టార్గెట్ చేస్తాయి. మూడో ఎపిసోడ్ లో ఒక మహిళ ప్రతి రాత్రి ఒక భూతంగా మారి, ఆ గ్రామంలోని మగాళ్లను చంపుతుంటుంది. మిగిలిన ఎపిసోడ్‌లు డెమాన్ పాసెషన్ మీదనే నడుస్తాయి.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×