Budget Washing Machine: శుభ్రత అనేది వ్యక్తిగత పరిరక్షణకే మాత్రమే కాదు. కుటుంబ విలువలకు అద్దం పట్టే అంశం కూడా. ప్రతీ ఇంట్లో కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజువారి శుభ్రతలో దుస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే వీటిని శుభ్రంగా ఉంచడం కోసం బిజీ జీవనశైలిలో చేతులతో దుస్తులు ఉతకడం చాలా కష్టంగా మారింది. అలాంటి వారి కోసం వాషింగ్ మిషన్ ఇప్పుడు అవసరమైన వస్తువుగా మారిపోయింది.
వందలాది వేరియంట్లు..
కానీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వందలాది వేరియంట్ల మధ్య సరైనది ఎంచుకోవడం చాలా కష్టంగా మారింది. ధరలు, డిజైన్‌లు, ఫీచర్లు ఇవన్నీ చూసి చివరకు అయోమయంలో పడిపోతాం. అయితే ఏ ఫీచర్లను ప్రాధాన్యంగా చూడాలో, అలాగే బడ్జెట్‌తో పాటు పనితీరు ఎలా సమతుల్యం చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన ఫీచర్లు
7.5 కేజీ లోడ్ సామర్థ్యం ఉన్న ఈ మిషన్ 5 నుంచి 6 మందితో కూడిన మధ్య తరగతి కుటుంబాలకు చక్కగా సరిపోతుంది. ఎక్కువ దుస్తులను ఒకేసారి వాష్ చేయవచ్చు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా బోలెడు దుస్తుల వాష్ అవసరమైతే, ఈ మిషన్ అద్భుతంగా పనిచేస్తుంది.
Semi-Automatic విధానం
ఇది పూర్తి ఆటోమాటిక్ మిషన్ కాదేమో కానీ, మరింత కంట్రోల్ ఇస్తుంది. వాషింగ్, స్పిన్నింగ్ టబ్‌లు వేరుగా ఉండటం వల్ల, మీరు అవసరమొచ్చినప్పుడు స్పిన్ టబ్‌కి దుస్తులు మార్చుకోవచ్చు. ఇది నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, విద్యుత్‌ను కూడా ఆదా చేస్తుంది.
Wings Pulsator Wash టెక్నాలజీ
ఈ ప్రత్యేక టెక్నాలజీ ద్వారా నీటి ధార, బుడగలతో కలిపి వస్తువులను సమర్థవంతంగా శుభ్రపరచడం జరుగుతుంది. మురికి మరకలు సులభంగా తొలగిపోతాయి.
Read Also: LPG Gas: సామాన్యులకు షాకిచ్చిన ప్రభుత్వం..ఎల్పీజీ గ్యాస్ …
ఆకర్షణీయమైన డిజైన్
మోడర్న్ ఇంటీరియర్‌కి తగ్గట్లు డిజైన్ చేయబడిన ఈ మిషన్, Burgundy రంగుతో మీరు మీ ఇంటి అలంకరణలోనూ ప్రీమియమ్ టచ్‌కి తీసుకెళ్లవచ్చు.
విద్యుత్ వినియోగంలో ఆదా
ఈ మిషన్ విద్యుత్‌ను తక్కువగా వినియోగిస్తూ ఎక్కువ పనితీరు ఇస్తుంది. దీంతో విద్యుత్ బిల్లులో కూడా తక్కువ ఖర్చు అవుతుంది. దీర్ఘకాలికంగా ఇది మీకు పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుంది.
సులభమైన ఇన్‌స్టాలేషన్ & ఉపయోగం
ఈ వాషింగ్ మిషన్‌ను ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. ప్రొఫెషనల్ టెక్నీషియన్ సాయంతో మీ ఇంట్లో నిమిషాల్లో ఇన్‌స్టాల్ చేయించవచ్చు. మిషన్ యూజర్ ఫ్రెండ్లీ డయల్ కంట్రోల్స్‌తో ఉండటంతో, వృద్ధులు, యువత లేదా ఇంటి పనిలో సహాయపడే వారు కూడా సులభంగా ఆపరేట్ చేయగలుగుతారు.
ఆటో టెంపరేచర్ కంట్రోల్ & మృదువైన శుభ్రత
ఈ మోడల్ ఆటో టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్‌తో నీటి ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. ఇది పిల్లల దుస్తులు, డెలికేట్ గార్మెంట్స్ వంటి సున్నితమైన వస్తువులకు మరింత రక్షణనిస్తుంది.
డ్యురబిలిటీ & వారంటీ
Voltas-Beko ఉత్పత్తులు టాటా గ్రూప్ పేరుతో వస్తున్నాయంటే, దానికి నాణ్యత ఉందని స్పష్టమవుతుంది. దీర్ఘకాలిక ఉపయోగానికి అనువుగా తయారు చేయబడ్డ ఈ వాషింగ్ మిషన్, పటిష్టమైన బాడీ, మోటార్‌తో రఫ్ & టఫ్ యూజ్‌కి తగినది.
ధర & తగ్గింపు
ఈ మోడల్ అసలు ధర రూ. 7,490 కాగా, ప్రస్తుతం రూ. 5,490కి మాత్రమే లభ్యమవుతోంది. అంటే మీకు 27% తగ్గింపు లభిస్తుంది.