OTT Movie : కామెడీ జనర్ లో వచ్చే సినిమాలను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఓ వ్యక్తి మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముప్ప తిప్పలు పడుతుంటాడు. ఈ సినిమా చివరివరకూ సరదాగా సాగిపోతుంది. ఇందులో క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 ( ZEE5) ఓటీటీలో
ఈ తెలుగు కామెడీ ఎంటర్టైనర్ డ్రామా మూవీ పేరు ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ (Battala Ramaswamy Biopikku) 2021లో విడుదలైన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఇందులో రామస్వామి జీవిత కథను వినోదాత్మకంగా, సెటైరికల్‌గా చూపించడం జరుగుతుంది. ఇది జీ 5 ( ZEE5) ఓటీటీలో ప్లాట్ ఫామ్‌లో 2021 మే 14న విడుదలైంది. ఆల్తాఫ్ హసన్ (రామస్వామి), శాంతి రావు (జయప్రద), లావణ్య రెడ్డి (జయసుధ), సత్విక జై (శ్రీదేవి) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
స్టోరీలోకి వెళితే
బట్టల రామస్వామి (ఆల్తాఫ్ హసన్) అనే వ్యక్తి గోదావరి ప్రాంతంలోని ఒక గ్రామంలో నివసిస్తుంటాడు . అతనికి ప్రధానంగా రెండు కోరికలు ఉంటాయి. 1) శ్రీరాముడిలా ఒకే భార్యతో జీవించడం, 2) చీరల వ్యాపారం ప్రారంభించడం. అతను జయప్రద (శాంతి రావు) అనే ఒక అమ్మాయిప్రేమలో పడతాడు. ఆమె తన బంగారు గొలుసును తాకట్టు పెట్టి రామస్వామికి చీరల వ్యాపారం ప్రారంభించడంలో సహాయం చేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకుంటారు. అయితే, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రామస్వామి జయప్రద సోదరి జయసుధని వివాహం చేసుకోవాల్సి వస్తుంది, ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుంటుంది. తర్వాత చీరలు అమ్మే క్రమంలో ఒక గ్రామంలో శ్రీదేవి అనే మరో యువతిని కూడా వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ మూడు వివాహాల వల్ల రామస్వామి జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అతని మూడు భార్యల మధ్య విభేదాలు, తండ్రి వదిలిపెట్టిన అప్పులు అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. మూవీ ప్రారంభంలో రామస్వామి మృతదేహం చూపించబడుతుంది. ఒక గ్రామస్థుడు అతని జీవిత కథను వివారిస్తుంటాడు. ముగ్గురు భార్యలు ఒకే ఇంట్లో కలిసి జీవించడం, వారి మధ్య గొడవలు, రామస్వామి వాటిని సమన్వయం చేయడానికి పడే పాట్లు కథలో ముఖ్య భాగంగా చూపించడం జరుగుతుంది. చివరికి రామస్వామి మరణానికి దారితీసిన సంఘటనలు ఏమిటి? అతను నిజంగా చనిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ అమ్మాయి అరాచకం చూడడానికి రెండు కళ్ళూ చాలవు… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్