E-Paper
Advertisement

OTT Movie : వర్షాకాలంలో మాత్రమే మొగుడి దగ్గరకు వచ్చే భార్య… కేక పెట్టించే కొరియన్ డ్రామా

OTT Movie : వర్షాకాలంలో మాత్రమే మొగుడి దగ్గరకు వచ్చే భార్య… కేక పెట్టించే కొరియన్ డ్రామా
Advertisement

OTT Movie : కొరియన్ సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ బాగా పాపులర్ అవుతున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలను ఒక్క సారి చూస్తే మనసులోనే ఉండిపోతాయి. అంత చక్కగా ఈ కథలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ ఇండస్ట్రీ నుంచి ఒక అద్భుతమైన ఎమోషనల్ రొమాంటిక్ ఫ్యాంటసీ సినిమా వచ్చింది. కొరియాలో టాప్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచి, ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. కొరియన్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ఒక ఫ్యామిలిలో భార్య చనిపోతూ, వర్షాకాలంలో తిరిగి వస్తానని భర్తకి ప్రామిస్ చేస్తుంది. ఆ తరువాత హార్ట్‌ టచింగ్‌ సీన్స్ తో ఈ సినిమా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ కొరియన్ మూవీ పేరు ‘బీ విత్ యూ’. 2018లో వచ్చిన ఈ మూవీ టకుజీ ఇచికావా జపాన్ నవల ఆధారంగా లీ జాంగ్-హూన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో సో జీ-సబ్, సన్ యే-జిన్ జోడీగా నటించారు. 132 నిమిషాల ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, టుబి, ప్లెక్స్ లో అందుబాటులో ఉంది. ఇది 2018లో 39th బ్లూ డ్రాగన్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా సన్ యే-జిన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కిమ్ హ్యూన్-సూ అవార్డ్స్ గెలుచుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సూహా, వూ జిన్ అనే జంటకి జీ-హో అనే కొడుకు ఉంటాడు. సంతోషంగా సాగుతున్న వీళ్ళ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. సూహా ఒక రోజు జబ్బున పడి మరణానికి దగ్గరవుతుంది. చనిపోయే ముందు తన భర్త వూ-జిన్, కొడుకు జీ-హోకి ఒక ప్రామిస్ ఇస్తుంది. వచ్చే వర్షాకాలంలో నేను తిరిగి వస్తానని చెప్పి చనిపోతుంది. ఆమె మరణించాక వూ-జిన్ ఒంటరిగా కొడుకుని పెంచుతూ ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాడు. ఒక రోజు వానలు కురుస్తుండగా, రైల్వే టన్నెల్ దగ్గర సూహా ఒక్కసారిగా కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు ప్రాణాలతో మరింత అందంగా, గతం ఏమీ గుర్తులేకుండా ఉంటుంది.

Read Also :  ఉద్యోగం కోసం వచ్చి ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? గూస్ బంప్స్ తెప్పించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

వూ జిన్ ఆమెను ఇంటికి తీసుకువచ్చి, నేను నీ భర్తను, ఇతను నీ కొడుకు అని పరిచయం చేస్తాడు. సూహాకి ఇంట్లోకి వచ్చి, గతం గుర్తులేకపోయినా కొత్తగా ప్రేమను, ఫ్యామిలీ బాండ్‌ని అనుభవిస్తుంది. కానీ వర్షాకాలం ముగిసే టైమ్ దగ్గరపడుతుంది. ఆమె మళ్లీ వెళ్లిపోవాల్సి ఉంటుంది. కథలో రియల్ ట్విస్ట్ ఏంటంటే, సూహాకి గతం గుర్తు లేకపోయినా, ఆమె రాసిన ఒక డైరీ ద్వారా వూ జిన్‌కి ఆమె ఎందుకు తిరిగి వచ్చిందనే విషయం తెలుస్తుంది. చివరికి సూహా వెళ్లిపోతుందా ? ఆమె ఎలా వచ్చింది ? మళ్ళీ వర్షాకాలంలో వస్తుందా ? ఈ కథకి క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ రొమాంటిక్ ఫ్యాంటసీ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

Big Stories

Advertisement
×