OTT Movie : యానిమేటెడ్ సినిమాలను ఎక్కువగా పిల్లలు చూస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు పెద్దలను కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇపుడు మనం చెప్పుకోబోయే యానిమేటెడ్ మూవీ యాక్షన్ సీన్స్ తో అదరగొడుతుంది. బియోవుల్ఫ్ అనే యోధుడి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
హ్రోత్గార్ అనే డెన్మార్క్ రాజు తన రాజ్యంలో ఉత్సవాలను గొప్పగా జరుపుతుంటాడు. అయితే గ్రెండెల్ అనే భయంకరమైన రాక్షసుడు ఈ ఉత్సవాల శబ్దానికి చిరాకుపడి, కోపంతో ఆ రాజ్యంపై దాడి చేస్తాడు. ఈ దాడిలో చాలా మంది ప్రజలు చనిపోతారు. హ్రోత్గార్ ఈ రాక్షసుడిని అంతం చేయడానికి, ఒక కోయోధుడి కోసం వెతుకుతాడు. ఈ సమయంలో బియోవుల్ఫ్ అనే వీరుడు, తన సహచరులతో కలిసి డెన్మార్క్‌కు చేరుకుంటాడు. గ్రెండెల్‌ను చంపడానికి సిద్ధమవుతాడు. బియోవుల్ఫ్, గ్రెండెల్‌తో ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే గ్రెండెల్ కూడా ఆయుధాలు ఉపయోగించకుండా వస్తాడు. ఒక భీకర పోరాటంలో బియోవుల్ఫ్, గ్రెండెల్ చేయిని విరిచి చంపేస్తాడు. ఈ విజయాన్ని జరుపుకుంటున్నప్పుడు, గ్రెండెల్ తల్లి ఒక రాక్షసరూపంలో ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి, బియోవుల్ఫ్ మనుషులను చంపుతుంది.
బియోవుల్ఫ్ గ్రెండెల్ తల్లిని చంపడానికి ఆమె గుహ వద్దకు వెళ్తాడు. కానీ ఆమె అతన్ని చూసి ఇష్టపడి, ఒక ఒప్పందం ప్రతిపాదిస్తుంది. ఆమెకు ఒక కొడుకును ఇవ్వడం ద్వారా, అతను అపరిమితమైన శక్తిని, రాజ్యాన్ని కూడా పొందవచ్చు అని చెప్తుంది. బియోవుల్ఫ్ ఆమె అందానికి లొంగి, ఆమెతో ఒప్పందం చేసుకుంటాడు. కానీ ఆమెను కూడా చంపినట్లు హ్రోత్గార్ కి అబద్ధం చెబుతాడు. ఈ క్రమంలో గ్రెండెల్ తల్లితో తనకు కూడా సంబంధం ఉందని, గ్రెండెల్ అతని కొడుకని ఒప్పుకుంటాడు హ్రోత్గార్. తన రాజ్యాన్ని బియోవుల్ఫ్‌కు అప్పగిస్తూ ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత కొన్నిసంవత్సరాల వరకు , బియోవుల్ఫ్ డెన్మార్క్ రాజుగా ఉంటాడు. కానీ అతని ఒప్పందం ఫలితంగా, ఒక డ్రాగన్ ఈ రాజ్యంపై దాడి చేస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, బియోవుల్ఫ్ ఆ డ్రాగన్‌తో యుద్ధం చేస్తాడు. చివరికి బియోవుల్ఫ్ డ్రాగన్ ను ఓడిస్తాడా ? తన రాజ్యానికి ముప్పు రాకుండా చూసుకుంటాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ యానిమేటెడ్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : రవ్యూ ఇస్తే చంపేసే సైకో… దుల్కర్ సల్మాన్ మోస్ట్ వయొలెంట్ మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ యానిమేటెడ్ ఫాంటసీ యాక్షన్ మూవీ పేరు ‘బియోవుల్ఫ్’ (Beowulf). ఈ సినిమాకి రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించారు. ఇది పాత ఇంగ్లీష్ ఇతిహాస కావ్యం “బియోవుల్ఫ్” ఆధారంగా రూపొందింది. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో 2007 నవంబర్ 16న థియేట్రికల్‌గా విడుదలైంది. ఈ మూవీ స్టోరీ ఒక వీరోచిత యోధుడైన బియోవుల్ఫ్ చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.