RCB Struggles: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 17 సంవత్సరాల తర్వాత ఈ 18వ సీజన్ లో కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… తప్పు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ అదృష్టం… ఏమాత్రం బాగాలేదు. ప్రతి సీజన్లో కప్పు కొట్టాలనే కసితో ఈ జట్టు బరిలోకి దిగుతుంది. ఇలా 17 సంవత్సరాలుగా కొనసాగుతోంది. కానీ ఒక్కసారి కూడా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలవలేదు.
Also Read: Retirement @ 7:29 PM : ధోని అంటే ఇంత అభిమానమా.. రోహిత్ రిటైర్మెంట్ లోనూ ఫాలో అయిపోయాడు
బెంగళూరు కొంపముంచిన పాకిస్తాన్ యుద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణించింది. కప్పు కూడా కచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టం ఏమాత్రం సహకరించలేదు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో పాయింట్లు పట్టికలో ఒకానొక సమయంలో నెంబర్ వన్ పొజిషన్లో కూడా ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో… మొత్తం ఎనిమిది విజయాలను నమోదు చేసుకుని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇందులో కేవలం మూడు పరాజయాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 16 పాయింట్లు సాధించిన రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు… ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. దాదాపు ప్లే ఆఫ్స్ కు వెళ్లినట్టే.
ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అర్ధాంతరంగా ఐపిఎల్ టోర్నమెంట్ 2025 వాయిదా పడింది. నిరవధికంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి వాయిదా వేసింది. అసలు ఈ టోర్నమెంట్ మళ్లీ జరుగుతుందని.. ఆశ ఎవరి దగ్గర లేదు. దీంతో ఈ సీజన్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలిచే అవకాశాలు లేవని చెప్తున్నారు. గతంలో కూడా… టోర్నమెంట్ గెలిచే క్రమంలో.. అనేక కారణాలవల్ల టోర్నమెంట్ గెలవలేకపోయింది. బ్యాటింగ్ బాగా చేసిన సమయంలో బౌలింగ్లో విఫలమైంది బెంగళూరు. బౌలింగ్ లో బాగా రాణిస్తే బ్యాటింగ్లో విఫలమయ్యేది. అలాగే.. కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం అసలు కీలక ప్లేయర్లైన కొంతమందిని వదిలేసుకుంది. అలా కూడా ట్రోఫీ గెలిచే అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంది. ఈసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా.. టోర్నమెంట్ వాయిదా పడింది.
ట్రోలింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్
రాయల్ చాలెంజర్స్ జట్టును దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ఎప్పుడు గెలవని జట్టు గెలిస్తే ఇలాగే జరుగుతుంది.. అనవసరంగా మమ్మల్ని ట్రోలింగ్ చేశారు.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని సెటైర్లు పేల్చుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ఇప్పుడు కాదు 100 టోర్నమెంట్లు వచ్చినా కూడా మీరు కప్పు గెలవలేరనిస్తున్నారు.