Best Animated Movies on OTT : సరదాగా సాగిపోయే యానిమేటెడ్ మూవీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. మీ పిల్లలతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి, ఈ సినిమాలకు మించి బెస్ట్ ఆప్షన్ లేదు. ఓటిటిలో బూతు కంటెంట్తో ఎక్కువగానే సినిమాలు, వెబ్ సిరీస్ లో వస్తున్నాయి. ఈ యానిమేషన్ సినిమాలలో ఆ ప్రాబ్లం ఉండదు. పిల్లలతో కలసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇప్పుడు మనం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ యానిమేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం.
ది లయన్ కింగ్ (The lion king)
1994 లో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీని వాల్ట్ డిస్నీ ఫీచర్ యానిమేషన్ ద్వారా నిర్మించబడింది. దీనికి రోజర్ అల్లెర్స్, రాబ్ మిన్‌కాఫ్ దర్శకత్వం వహించారు. సింబా అనే సింహం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. 1994 లో ఈ మూవీని రిలీజ్ చేయగా, 2019 లో మరోసారి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ యానిమేటెడ్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాటటౌల్లె (Ratatouille)
2007 లో పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ యానిమేటెడ్ కామెడీ మూవీకి బ్రాడ్ బర్డ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి ఓస్వాల్ట్, లౌ రొమానో, ఇయాన్ హోల్మ్, జానేనే గరోఫాలో, పీటర్ ఓ’టూల్, బ్రియాన్ డెన్నెహీ, పీటర్ సోహ్న్ స్వరాలు అందించారు. అగస్టే గస్టియు రెస్టారెంట్‌లో చెఫ్ కావాలని కలలు కన్న ఒక ఎలుక చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ యానిమేటెడ్ మూవీ డిస్నీ+ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇన్‌సైడ్ 2 (Inside out 2)
2024 రిలీజ్ అయిన ఈ మూవీని పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించగా, కెల్సే మాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2015 లో వచ్చిన ఇన్‌సైడ్ అవుట్‌కి సీక్వెల్ గా వచ్చింది. ఈ మూవీ రిలే అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇన్‌సైడ్ అవుట్ 2 జూన్ 10, 2024న లాస్ ఏంజెల్స్‌లోని ఎల్ క్యాపిటన్ థియేటర్‌లో ప్రదర్శించబడింది. జూన్ 14న యునైటెడ్ స్టేట్స్‌లోని థియేటర్‌లలో విడుదలైంది. ఈ యానిమేటెడ్ మూవీ డిస్నీ+ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
మోనా (Mona)
2016 లో రిలీజ్ అయిన ఈ అడ్వెంచర్ మూవీని వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించగా, రాన్ క్లెమెంట్స్ దర్శకత్వం వహించారు. క్రిస్ విలియమ్స్ మరియు డాన్ హాల్ సహ-దర్శకత్వం వహించారు. రాచెల్ హౌస్, టెమ్యురా మోరిసన్, జెమైన్ క్లెమెంట్, నికోల్ షెర్జింజర్, అలాన్ టుడిక్‌ల స్వరాలు అందించారు. మోనా సముద్ర తీరప్రాంత గ్రామంలో ఒక నాయకుడి కుమార్తె. టె ఫితి దేవతతో ఒక ఆధ్యాత్మిక అవశేషాన్ని తిరిగి కలపడానికి సముద్రం ప్రయాణం చేస్తుంది. ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ డిస్నీ+ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.