E-Paper
Advertisement

The Great Flood OTT : ఓటీటీలో ఎమోషనల్ సునామీ సృష్టించిన 1 గంట 49 నిమిషాల సై-ఫై డ్రామా… గుండెను మెలిపెట్టే కథ గురూ

The Great Flood OTT : ఓటీటీలో ఎమోషనల్ సునామీ సృష్టించిన 1 గంట 49 నిమిషాల సై-ఫై డ్రామా… గుండెను మెలిపెట్టే కథ గురూ
Advertisement

The Great Flood OTT : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రొమాన్స్ నుండి యాక్షన్, హర్రర్-కామెడీ వరకు అన్ని రకాల కంటెంట్‌తో నిండిపోయాయి. అయితే అందులో బెస్ట్ సర్వైవల్, సై-ఫై డ్రామాలను వెతకాలంటే కాస్త కష్టమే. కానీ రీసెంట్ గా ఇలాంటి జానర్లో వచ్చిన ఓ మూవీ మాత్రం దుమ్మురేపుతోంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్ తో పాటు ఇందులో సునామీ, ప్రపంచ వినాశం వంటి సై-ఫై అంశాలు కూడా మెండుగా ఉన్నాయి. మరి కొత్తగా వచ్చిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

మూడు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ప్రీమియర్ అయ్యి, సంచలనం సృష్టించిన ఒక పవర్ ఫుల్ సినిమాల గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఈ చిత్రంలో కృత్రిమ మేధస్సు, దాని వల్ల జరిగే అనార్థాలను అద్భుతంగా చూపించారు. డిసెంబర్ 19న విడుదలైన కొరియన్ చిత్రం “ది గ్రేట్ ఫ్లడ్” The Great Flood (2025) గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ప్రఖ్యాత కొరియన్ దర్శకుడు కిమ్ బైంగ్-వూ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం మూవీ లవర్స్ మనస్సులను దోచుకుంది. ప్రతి సన్నివేశం ఆశ్చర్యకరమైన మలుపులతో నిండి, ప్రారంభం నుండి ముగింపు వరకు ఎమోషన్స్ తో కట్టిపడేస్తుంది. మూవీ కథ ఒక తల్, కొడుకు చుట్టూ తిరుగుతుంది. తల్లి ప్రేమలోని కొత్త కోణాన్ని ప్రదర్శించిన ఈ సినిమా కన్నీళ్ళు పెట్టిస్తుంది. సునామీ సమయంలో ఒక భవనంలో చిక్కుకున్న కిమ్ డా-మిని, ఆమె ఆరేళ్ల కుమారుడు జా-ఇన్‌ స్టోరీ ఇది. IMDb లో 10కి 5.4 రేటింగ్ పొందిన ఈ మూవీ ఆకర్షణీయంగా ఉంటుంది. రన్ టైమ్ కూడా 1 గంట 49 నిమిషాలు మాత్రమే. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది.

Advertisement

Read Also :  మనిషిని పెంపుడు జంతువులా పెంచుకునే డైనోసార్… ఇలాంటి సినిమాను లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే భయ్యా

కథలోకి వెళ్తే…

సియోల్‌ లో ఒక భారీ యాస్టరాయిడ్ ఇంపాక్ట్ వల్ల అంటార్కిటికా ఐస్ మెల్ట్అవుతుంది. దీంతో ప్రపంచాన్ని ముంచే వరదలతో అన్నీ దేశాలు అతలాకుతలం అవుతాయి. అన్-నా (కిమ్ డా-మి) అనే AI రీసెర్చర్, ఆమె చిన్న కొడుకు జా-ఇన్‌తో 30 అంతస్తుల బిల్డింగ్‌ లో ఈ డేంజరస్ సిట్యుయేషన్ లో చిక్కుకుంటుంది. వరదల వల్ల ఓ వైపు నీరు పెరిగిపోతుంటే, రూఫ్‌ టాప్‌కు చేరుకోవడానికి పానిక్ అవుతుంటారు కొందరు. మరికొందరి ప్రపంచ వినాశాన్ని పక్కన పెట్టి దోచుకోవడానికి తెగబడతారు. ఈ క్రమంలో కొడుకుతో కలిసి రెస్క్యూ టీం దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది హీరోయిన్. అంతలోనే కొడుకు మిస్ అవుతాడు. ఒక మిస్టీరియస్ సెక్యూరిటీ ఏజెంట్ హీ-జో (పార్క్ హే-సూ) ఆమెను రెస్క్యూ చేసి, కొడుకును వెతకడానికి హెల్ప్ చేస్తాడు. కానీ హీ-జోపై హీరోయిన్ అనుమానపడుతుంది.

Advertisement

కథ మొదట టెన్స్ సర్వైవల్ డ్రామాగా మొదలై… వాటర్ VFX, క్లాస్ట్రోఫోబిక్ అపార్ట్‌మెంట్ సీన్స్ తో ఇంటెన్స్ గా మారుతుంది. మధ్యలో ట్విస్ట్ వచ్చి టైమ్ లూప్, AI ఎమోషన్ ఇంజిన్ వంటి సై-ఫై ఎలిమెంట్స్ ఎంటర్ అవుతాయి. మదర్ లవ్ vs ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి థీమ్స్ తో మూవీ అద్భుతంగా ఉంటుంది. మరి హీరోయిన్ తన కొడుకుని కనిపెట్టగలిగిందా? ఆమెను కాపాడిన మిస్టీరియస్ హీరో ఎవరు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×