Best horror movies on OTT : హర్రర్ సినిమాలను చూడాలంటే ఎవరికైనా కాస్త ధైర్యం ఉండాల్సిందే. కొన్ని సినిమాలు పగలు చూస్తే కూడా భయం వేస్తుంది. అటువంటి సినిమాలను రాత్రి పూట చూడాలంటే భయంతో వనికి పోతారు. కొన్ని హర్రర్ సినిమాలను రాత్రిపూట చూసిన తర్వాత ఒంటరిగా నిద్ర పోవాలంటే భయమేస్తుంది. కొన్ని హర్రర్ సినిమాలను చూస్తున్నంత సేపు హనుమాన్ చాలీసా జపించిన వాళ్లు చాలామంది ఉన్నారు. అటువంటి బెస్ట్ హారర్ మూవీస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం పదండి.
రాత్ (Raat)
ఈ సినిమా లో హీరోయిన్ గా రేవతి నటించింది. ఈ హర్రర్ సినిమాకి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీ చూడాలంటే చాలా భయపడే వాళ్లు. ఈ మూవీని చూస్తున్నంత సేపు వెన్నెలలో వణుకు పుడుతూ ఉంటుంది. ఈ హారర్ సినిమాలో భయంకరమైన సన్నివేశాలు చాలానే ఉంటాయి. హర్రర్ ప్రియులు తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ హర్రర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
డర్నా మనా హై (Darna mana Hai)
ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్, వివేక్ ఒబెరాయ్, నానా పటేకర్, శిల్పా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. రాంగోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవల్ రామన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ మూవీ ని కూడా ఒంటరిగా చూడటం కష్టమే. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
తుంబాద్ (Tumbbad)
మహారాష్ట్రలోని ఒక గ్రామంలో జరిగిన ఘటనతో ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ మూవీ చూస్తున్నంత సేపు గూస్బంప్స్ తెప్పిస్తుంది. భయంకరమైన సన్నివేశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు పై ప్రాణాలు పైకే పోతాయి. ఈ మూవీ నెట్ ఫిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏక్ దీ దాయన్ (Ek Thi Dayan)
ఇది ఒక భయంకరమైన మూవీ. కొంకనా సేన్ తన నటనతో ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ మొదటి నుండి చివరి వరకు చాలా సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెట్టిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
హారర్ స్టోరీ (Horror Story)
ఈ మూవీలో రవీష్ దేశాయ్, కరణ్ కుంద్రా ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ భట్ కథను రాయగా, ఆయుష్ రైనా దర్శకత్వం వహించారు. ఈ మూవీని చూడాలంటే ఒంటరిగా అసాధ్యమని చెప్పాలి. కొంతమంది స్నేహితులు ఒక ప్రమాదకరమైన హంటెడ్ హోటల్ లో బస చేస్తారు. నా హోటల్ లో దయ్యాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీ చూస్తున్నంత సేపు గుండె దడ పెరుగుతూ ఉంటుంది. హర్రర్ ప్రియులు పైన చెప్పిన మూవీలను ఒకసారి రాత్రిపూట చూడండి. అలా చూస్తే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ మూవీ యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.