Best Horror Movies on OTT : ఒకప్పుడు పిల్లలు ఎంటర్టైన్ అవడానికి పెద్దలు కథల రూపంలో దయ్యాల స్టోరీలను చెప్పేవారు. ఆ తర్వాత థియేటర్లకు వెళ్లి దయ్యాలు ఇలా ఉంటాయా అనుకునేవారు. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో దయ్యాల సినిమాల హడావిడి కొనసాగుతోంది. ఈ సినిమాలను కొత్త కొత్త స్టోరీలతో తెరమీద ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అటువంటి భయపెట్టే హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే వెన్నులో వణుకుపుడుతుంది. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీల గురించి తెలుసుకుందాం.
అవల్ (Aval)
తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ అవల్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది. సిద్ధార్థ ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మిలింద్ రావు దర్శకత్వం వహించాడు. తమిళ్ లో అవల్ పేరుతో హిందీ భాషల ది హౌస్ నెక్స్ట్ డోర్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగులో గృహం పేరుతో ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ బెస్ట్ హర్రర్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎజ్రా (Ezra)
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. పృద్వి సుకుమారాన్, ప్రియా ఆనంద్, విజయ్ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2017 లో థియేటర్లలో రిలీజ్ అవ్వగా, మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి జయకృష్ణ న్ దర్శకత్వమహించారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాత్రి (Raatri)
ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో రేవతి ప్రధాన పాత్రలో నటించారు. 1992లో రిలీజ్ అయిన ఈ మూవీకి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమాను పగలు చూడాలన్నా భయపడేవాళ్లు. రాంగోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం ఇప్పటికీ బెస్ట్ హర్రర్ మూవీ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
పిజ్జా (Pizza)
విజయ్ సేతుపతి, రమ్యనంబిషన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకి, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. 2012 లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విజయ్ సేతుపతి కెరీర్లో బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈహారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney +hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.
హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే మూవీ లవర్స్ ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. రాత్రిపూట అయితే మరింతగా థ్రిల్ పొందవచ్చు. మరెందుకు ఆలశ్యం, వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్ వేయండి.