Nawaz Sharif India Attack| పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను గడగడలాడేలా చావుదెబ్బ కొట్టింది. అయితే, ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ భారతదేశంపై సైనిక దాడికి దిగింది. ఈ దాడికి వ్యూహాన్ని రూపొందించడానికి పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పర్యవేక్షణ చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఇలా చెప్పారు: “ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో పాక్ సైన్యం భారతదేశంపై దాడి చేయడంలో నవాజ్ షరీఫ్ పాత్ర ముఖ్యంగా ఉంది. భారతదేశంపై పాక్ సైన్యం ఎలా దాడి చేయాలనే పథకాన్ని నవాజ్ షరీఫ్ పర్యవేక్షించారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదని, ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది” అని అన్నారు.
ఇటీవల మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌లో తీవ్ర పరిణామాలు సృష్టించింది. ఉగ్రవాదులని సమూలంగా నశింపజేసింది. శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో.. భారత సైనిక స్థావరాలపై మే 8, 9, 10 తేదీల్లో పాకిస్తాన్ ప్రతీకార దాడి చేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ, భారత సైన్యం ఆ దాడులను పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. పాక్ స్తాన్ డ్రోన్లను కూల్చివేసింది.
ఈ సమయంలో, పాకిస్తాన్ సైన్యంపై విరుద్ధ దళాలు, నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆజ్మా బుఖారీ చేసిన వ్యాఖ్యలు పలు దృష్టులను ఆకర్షించాయి.
Also Read: హనీట్రాప్‌లో పాక్ దౌత్యాధికారి.. బంగ్లాదేశీ యువతితో అశ్లీల వీడియోలు
భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన తర్వాత, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే ప్రభుత్వంలో ఎటువంటి అధికారిక పదవి లేకున్నా, అధికార పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (PML-N) అధ్యక్షుడిగా నవాజ్ షరీఫ్ ఆ సమావేశంలో పాల్గొన్నా. ఆ సమావేశంలో, భారత్‌తో దౌత్యపూర్వక చర్చలు, శాంతి ప్రక్రియను కొనసాగించడమే ఉత్తమ మార్గం అని ఆయన సూచించారు. ఈ సమయంలో, నవాజ్ షరీఫ్ భారతదేశంతో మరొకసారి శాంతి చర్చలు ప్రారంభించినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఇక, ఇటీవల కాల్పుల విరమణపై ఇరు దేశాలు అంగీకరించిన వెంటనే, నేతలు మరియు సైనికాధికారులను అభినందించారు.
నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సోదరుడు. ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధినేత మరియు మూడు సార్లు పాకిస్తాన్ ప్రధాని గా పని చేశారు. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో ఆయన పాకిస్తాన్ ప్రధాని గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన భారతదేశంలో యుద్దం చేయడాన్ని వ్యతిరేకించినా మిలిటీర జనరల్ పర్వేజ్ ముషరష్ దేశం మొత్తం తన నియంత్రణలోకి తీసుకున్నారు. అంతకుముందు కూడా నవజ్ షరీఫ్ భారతదేశం వైపు స్నేహ హస్తం అందించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశంపై మిలిటరీ దాడికి ప్లాన్ చేశాడని స్వయంగా ఆయన పార్టీ సభ్యులే ప్రకటించడమంటే ఒక విధంగా భారత్ కు వెన్నుపోటు లాంటిదే.