E-Paper
Advertisement

తమిళ రాజకీయాల్లో సంచలనం.. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం, 3 రోజులు డెడ్ లైన్

తమిళ రాజకీయాల్లో సంచలనం.. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం, 3 రోజులు డెడ్ లైన్
Advertisement

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. శనివారం సాయంత్రం చెన్నైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్రతో విజయ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా తన వైపు ఉన్న ఎమ్మెల్యేల బలం.. తనకు మద్దతు తెలుపుతున్న ఇతర పార్టీల వివరాలతో కూడిన పత్రాన్ని విజయ్ గవర్నర్‌కు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తన వద్ద ఉందని ఆయన స్పష్టం చేశారు.

రేపే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని.. అందుకు అనుమతి ఇవ్వాలని విజయ్ కోరారు. విజయ్ సమర్పించిన పత్రాలను పరిశీలించిన గవర్నర్ రాజేంద్ర.. సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ఇందుకు సంబంధించిన అధికారిక అనుమతి పత్రాన్ని విజయ్‌కి స్వయంగా అందజేశారు. దీంతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని సరికొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి మార్గం సుగమమైంది. రేపు ఉదయమే ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

Advertisement

షెడ్యూల్ ప్రకారం గవర్నర్ రాజేంద్ర రేపు కేరళ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయాన్ని కాస్త ముందుకు జరిపారు. రేపు ఉదయం 10 గంటలకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్ కేరళ బయలుదేరి వెళ్తారు. అత్యంత వేగంగా జరిగిన ఈ పరిణామాలు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. రాజ్‌భవన్ పరిసరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినప్పటికీ.. విజయ్‌కు గవర్నర్ ఒక కీలక షరతు విధించారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించారు. ఈ తక్కువ కాల వ్యవధిలో విజయ్ తన మేజిక్ ఫిగర్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడం ఇప్పుడు విజయ్‌కు పెద్ద సవాలుగా మారింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ మూడు రోజుల గడువుపై ఆసక్తికర చర్చలు జరుపుతున్నారు.

Advertisement

విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతుండటం విశేషం. ఆయన అభిమానులు.. పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నై వీధులన్నీ TVK జెండాలతో నిండిపోయాయి. రేపు ఉదయం 10 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త శకం ప్రారంభం కాబోతోందని విజయ్ మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: డ్రెస్సింగ్ నుంచి పాలిటిక్స్ వరకు.. విజయ్ అంతా జగన్ స్టైలే, రోజా సంచలన వ్యాఖ్యలు

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

Big Stories

Advertisement
×