BigTV English

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్  నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.


సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించడం వీరి ప్రధాన బాధ్యత. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఇక రాత్రి వేళ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కూడా వారి సేవలు వినియోగించుకోనుంది.

తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, అలాగే ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను రూపొందించనుంది. వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు అదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.


తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్లపై ఫోకస్ చేసింది. సమాజంలో గౌరవప్రదంగా వారు జీవించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వారి ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

ALSO READ:  సురేష్ మా పార్టీ కార్య‌క‌ర్తే.. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

నార్మల్‌గా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ట్రాన్స్‌జెండర్లు మాత్రం వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. వారికి వైద్యం చేయడానికి డాక్టర్లు సైతం ఆలోచిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మైత్రి పేరిట విభాగాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ సేవలను అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నారు. వారానికి రెండురోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు. అది ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×