OTT Movie : ఓటీటీలో ఒక యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ దూసుకుపోతోంది. ఈసినిమాలో డైలాగ్స్ లేనప్పటికీ, విజువల్ స్టోరీటెల్లింగ్ ద్వారా కథను చెప్పడంలో ప్రత్యేకతను కలిగి ఉంది. ఒక నల్ల పిల్లి చుట్టూ తిరిగే ఈ స్టోరీ ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీ ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ సినిమా పేరు ‘ఫ్లో’ (Flow). 2024లో విడుదలైన ఈ సినిమాని గింట్స్ జిల్బలోడిస్ రూపొందించారు. ఈ సినిమా ఒక భారీ సునామీ తర్వాత పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో, ఒక నల్ల పిల్లితో పాటు ఇతర జంతువులు జరిపే సాహసయాత్రను చూపిస్తుంది. ఈ చిత్రం లాట్వియా, ఫ్రాన్స్, బెల్జియం నిర్మాణంతో రూపొందింది. ఇది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ కోసం ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను కూడా సాధించింది. IMDB లో ఈ సినిమాకి 6.8/10 రేటింగ్ ఉంది. ప్రైమ్ వీడియో, మాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఒక నల్ల పిల్లి చుట్టూ తిరుగుతుంది. ఈ పిల్లి ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఒక భారీ సునామీ కారణంగా దాని నివాసం పాడైపోతుంది. ఈ సునామీ మానవులు అంతరించిపోయినట్లు సూచించే ఒక పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో వస్తుంది. అయితే మానవుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా కనిపిస్తుంటాయి. ఇక ఆ పిల్లి ఒక ఓడపై ఆశ్రయం పొందుతుంది. ఈ ఓడలో ఒక కాపీబారా అనే జంతువు ఇప్పటికే నివాసం ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఈ ఓడలో మరికొన్ని జంతువులు చేరతాయి. ఈ జంతువులన్నీ భిన్నమైన స్వభావాలు కలిగి ఉంటాయి. ఈ జంతువులు ఓడలో ఒకచోట చేరి, నీటితో నిండిన ఈ కొత్త ప్రపంచంలో, భూమిని వెతకడానికి ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణంలో వాటి మధ్య పరస్పర సహకారం, ధైర్యం, తెలివితేటలు అవసరమవుతాయి.
పిల్లి మొదట్లో ఒంటరిగా ఉండటానికి అలవాటుపడినా, ఆ తరువాత ఇతర జంతువులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఒక తీవ్రమైన తుఫాను కారణంగా , ఓడ భారీ రాతి స్తంభాల మధ్య ప్రయాణిస్తుంది. ఈ సమయంలో, పిల్లి ఓడ నుండి పడిపోయి ఒడ్డుకు ఈదుతుంది. పిల్లి ఒక రాతి స్తంభం పైకి ఎక్కి, అక్కడ సెక్రటరీబర్డ్‌ను కలుస్తుంది. అక్కడ ఒక లాబిరింత్ లాంటి కట్టడం ఉంటుంది. ఈ పిల్లి ఓడకు తిరిగి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది చాలా దూరంలో ఉంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా నీటి వేగంగా తగ్గుతుంది. భూమిలో పెద్ద పగుళ్లు ఏర్పడి నీటిని లాక్కెళ్లిపోతుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని టర్న్ తీసుకుంటుంది. చివరికి ఈ జంతువులు నీళ్ళు లేని నేలను కనిపెడతాయా ? ఇవి మరిన్ని సమస్యలు ఎదుర్కుంటాయా ? మనుషులు ఎవరైనా ఉంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : తుడిచి పెట్టేసే సునామీ, బిల్డింగులను మింగేసే భూమి… ఆ ఒక్క ఫ్యామిలీ ఎస్కేప్… రాక్ మామ సర్వైవల్ థ్రిల్లర్