OTT Movie : ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల హడావిడి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వీటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక సామాన్య వ్యక్తి, నేరాలతో నిండిపోయిన ఒక సంస్థను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రయంలో ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సీకింగ్ జస్టిస్’ (Seeking Justice). 2011 లో విడుదలైన ఈ మూవీకి రోజర్ డొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. ఇందులో నికోలస్ కేజ్, జనవరి జోన్స్, మరియు గై పియర్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
విల్ హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తాడు. అతని భార్య లారా ఒక స్థానిక ఆర్కెస్ట్రాలో పనిచేస్తుంది. ఒక రాత్రి లారా ఒక ప్రదర్శన ఇచ్చి ఇంటికి వెళుతుండగా, హాడ్జ్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేసి హింసిస్తాడు. లారాకి తీవ్ర గాయాలు అవ్వడంతో, విల్ బాధపడుతూ ఆసుపత్రిలో లారా కి చికిత్స చెపిస్తూ ఉంటాడు. ఈ సమయంలో, సైమన్ అనే ఒక అపరిచిత వ్యక్తి విల్‌ను సంప్రదిస్తాడు. సైమన్ తాను ఒక సంస్థకు ప్రాతినిత్యం వహిస్తున్నానని చెప్పుకుంటాడు. ఈ సంస్థ, న్యాయవ్యవస్థ నుండి తప్పించుకున్న నేరస్థులను శిక్షిస్తుంది. హాడ్జ్ గతంలో ఇతర మహిళలపై కూడా దాడి చేసిన నేరస్థుడని, అతన్ని శిక్షించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని సైమన్ విల్ కు చెబుతాడు. దానికి బదులుగా, విల్ భవిష్యత్తులో వారికి ఒక చిన్న సహాయం చేయాలని షరతు విధిస్తాడు.విల్ ఆ సమయంలో సైమన్ ప్రతిపాదనను అంగీకరిస్తాడు. ఆ తరువాత హాడ్జ్ హత్య చేయబడతాడు.
ఆ తరువాత విల్‌కు తాను ఒక ప్రమాదకరమైన సంస్థలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సైమన్, విల్‌ను మరొక నేరస్థుడిని హత్య చేయమని బలవంతం చేస్తాడు. లేకపోతే అతని భార్య లారాకి ప్రమాదం ఉంటుందని బెదిరిస్తాడు. ఈ ఒప్పందం నుండి బయటపడాలని విల్ ప్రయత్నిస్తాడు, కానీ ఇందులో పోలీసులు, జర్నలిస్టులు, ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తుంది. విల్ ఈ సంస్థ నిజమైన స్వరూపాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను ఒక రిపోర్టర్ సేకరించిన ఆధారాలను కనిపెడతాడు. ఇందులో ఆ సంస్థ చీకటి రహస్యాలు ఉంటాయి. ఆ తరువాత సైమన్ లారాను కిడ్నాప్ చేస్తాడు. విల్ ఆమెను రక్షించడానికి సైమన్‌తో ఈ సారి ఒప్పందం అమలు చేస్తానని ఒప్పుకుంటాడు. చివరికి విల్ తన భార్యని కాపాడుకుంటాడా ? సైమన్ తో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేస్తాడా ? సైమన్ బుద్ధి చెబుతాడా ? ఈ విషయాలను, తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ గేమ్ ఆడితే ప్రాణాలతో తిరిగి రారు … బాబోయ్ ఇలాంటి గేమ్ లు కూడా ఉంటాయా ?